
Siri Hanumanth : యూ ట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ తో నటనలోకి ఎంటరైన సిరి హనుమంతు.. బుల్లితెర షోలలో పాపులర్ అయ్యింది. వీటితో పాటు వెండితెరపై కూడా నటిస్తూ మెప్పిస్తుంది. హీరోయిన్ చెల్లెలుగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో పాతుకుపోతోంది ముద్దుగుమ్మ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్ గా హౌజ్ లోకి ఎంటరై మరింత దగ్గరైంది. అనసూయ లాగానే సిరి హనుమంత్ కూడా కెరీర్ మొదట్లో మీడియాలో రిపోర్టర్, న్యూస్ రీడర్ గాకూడా చేసింది. సోషల్ మీడియాలో తన లెటెస్ట్ ఫొటోలను అప్ లోడ్ చేస్తూ ఫిదా చేస్తుంది ఈ అమ్మడు.
2 జనవరి, 1996లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో పుట్టింది సిరి హనుమంత్. ఇంటర్ తర్వాత ఎంసెట్ రాసింది. అటువైపు వెళ్లకుండా న్యూస్ ఛానల్ వైపునకు వచ్చింది సిరి. ‘U News’ అనే లోకల్ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ సంస్థ మూతపడడంతో ఆ తర్వాత మరో ఛానల్ ‘Y tv’లో కూడా న్యూస్ రీడర్ గా పని చేసింది.
ఆ తర్వాత హైదరాబాద్ కు వెళ్లిన ఆమె ‘99 tv’లో చేరింది. అక్కడ ఆరు నెలలు పనిచేసిన తర్వాత, ఆమె ‘T news’లో చేరింది. రెండు సంవత్సరాలకు పైగా న్యూస్ రీడర్‌గా చేసింది. ‘T news’లో పనిచేస్తున్న సమయంలోనే ఆమె సీరియల్‌లో పాత్ర కోసం ఆడిషన్‌కు హాజరై ఎంపికైంది.
ఆ తర్వాత స్టార్ మాలో ప్రసారమైన ‘ఉయ్యాల జంపాలా’ సీరియల్‌తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో తొలిసారిగా నటించింది. ఆమె తర్వాత ఎవరే నువ్వు మోహిని (జీ తెలుగు), అగ్నిసాక్షి (స్టార్ మా), సావిత్రమ్మ గారి అబ్బాయి (స్టార్ మా) వంటి పలు సీరియల్స్‌లో నటించింది.
ఈ సమయంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది, ఇద్దరి లోకం ఒకటే (2019), ఒరేయ్ బుజ్జిగా (2020) వంటి రెండు చిత్రాలలో నటించింది. ఈ మధ్య, ఆమె ‘మరపురాని ప్రేమ కథ’ (2015), ‘దట్’ (2016), ‘4 డేస్ విత్ శ్రీ’ (2016), ‘లవ్ & డౌట్’ (2018) వంటి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.
వీటితో పాటు సొంత యూ ట్యూబ్ ఛానల్ ‘హే సిరి’ని స్ట్రాట్ చేసింది. ఆమె ఛానల్ కు 488k సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో లాక్‌డౌన్ లవ్ (2020), మేడమ్ సర్ మేడమ్ అంతే (2020), రామ్ లీలా (2021) వంటి కొన్ని వెబ్ సిరీస్‌లను విడుదల చేసింది.
2021లో రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. ఆమె మరో యూ ట్యూబర్ శ్రీహాన్ తో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల శ్రీహాన్ బిగ్ బాస్ సీజన్ 6లో ఉండగా హౌజ్ లోకి విజిట్ చేసి శ్రీహాన్ తో క్లోజ్ గా ఉండే శ్రీసత్యకు వార్నింగ్ ఇచ్చింది. ఇది అప్పుడు హాట్ టాపిక్ గా మారింది.






