17.1 C
India
Sunday, December 7, 2025
More

    Rents in Canada : కెనడాలో ఆకాశాన్నంటుతున్న అద్దెలు.. ఉండలేక వచ్చేస్తున్న భారతీయులు

    Date:

    Rents in Canada
    Rents in Canada

    Rents in Canada : ఉన్నత చదువులు చదివిన ప్రతి ఒక్కరికి విదేశాల్లో ఉద్యోగం చేయాలనేది ఒక కల. అమెరికా తర్వాత భారత విద్యార్థులు, వృత్తినిపుణులు ఎక్కువగా వలస వెళ్లే దేశం కెనడా. ఇప్పుడు అక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ దేశంలో ఉండేందుకు ఇళ్లు దొరక్క వెళ్లిన వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల అద్దెలతో పాటు లీజుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలా కాలం క్రితమే అక్కడికి వెళ్లిన వారు సొంతంగా ఇళ్లు కొనుక్కుందాం అనుకుంటే ధరలు చూసి జంకుతున్నారు. ఈ పరిణామాలతో విద్యార్థులు, వలసదారులు నగర శివారు ప్రాంతాలకు తరలుతున్నారు. కొందరైతే ఈ అద్దెల భారాన్ని భరించలేక దేశాన్నే వదిలి వెళ్లిపోతున్నారు. ఇళ్ల అద్దెలను భరించలేక కెనడాను వదిలేస్తున్నవారి సంఖ్య 28 శాతంగా ఉన్నట్లు ఆంగస్‌ రీడ్‌ ఇనిస్టిట్యూట్‌ ఓ నివేదికలో పేర్కొంది. ఈ పరిణామాలతో కెనడా ప్రతిష్ఠ దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నో ఆశలతో కెనడాకు వస్తున్న వలసదారులకు సౌకర్యవంతమైన పరిస్థితులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకే చాలా మంది ఇతర దేశాల వైపు మళ్లుతున్నట్లు పేర్కొంది.

    అమెరికా తర్వాత భారతీయులు ఎక్కువగా వెళ్లేది కెనడానే.  ఏటా లక్షలాది మంది యువత ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం కెనడాకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడ భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు ప్రవాస భారతీయులకు కష్టంగా మారాయి. పెద్ద ఉద్యోగాలు దొరక్కపోయినా పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసైనా సంపాదించుకుందామని అక్కడికి వెళ్తున్న భారతీయులు అద్దెలను చూసి జంకుతున్నారు. కెనడాలో 2013 నాటికి 32,828 మంది ఉన్న భారతీయుల సంఖ్య 2023నాటికి అంటే సరిగ్గా పదేళ్లలో 1,39,715కి చేరింది. పదేళ్లలో ఏకంగా 326 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అక్కడ చోటుచేసుకున్న ఇళ్ల అద్దెల సంక్షోభం ఎన్నారైలపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

    2021 ఎన్నికల సమయంలోనే కెనడాలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయి. వ్యాపారులు, సంపన్న కార్పొరేట్లు, విదేశీ ఇన్వెస్టర్లకు కెనడాలో ఇల్లు లాభసాటిగా మారాయని అప్పట్లో లిబరల్ పార్టీ పేర్కొంది. దీంతో సంపన్నులు, ఫారిన్ ఇన్వెస్టర్లు భారీగా ఇళ్ల కొనుగోళ్లు చేపట్టారని తెలిపింది. ఈ పరిస్థితి కారణంగా ధరలు భారీగా పెరిగాయంటూ వివరణ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో విజయం తర్వాత కెనడావాసులు కాని వారు ఇళ్లు కొనడంపై నిషేధం అమలు చేసింది. మరోవైపు.. కెనడాకు వలసదారులు పెరిగిపోయిన కారణంగా ఇళ్ల సంక్షోభం ఏర్పడిందని 44.5 శాతం మంది కెనడియన్లు అభిప్రాయపడుతున్నారు. భారత్ నుంచి కెనడాకు వెళ్లిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఓ సంఘంగా ఏర్పడ్డారని, ఏటా వీరి సంఖ్య పెరుగుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B visas : హెచ్-1బీ వీసాలకు భారీ డిమాండ్: 85 వేల కోటాకు 3.4 లక్షల రిజిస్ట్రేషన్లు

    H-1B visas : అమెరికాలో విదేశీ నిపుణులకు అత్యంత ప్రాచుర్యం పొందిన హెచ్-1బీ...

    2025 AACTA ఇండస్ట్రీ అవార్డ్స్ గాలా – ప్రతిభకు ఘనత, విజయానికి స్మరణీయ రాత్రి

    AACTA : సిడ్నీ నగరంలో ఘనంగా నిర్వహించిన 2025 AACTA (ఆస్ట్రేలియన్ అకాడమీ...

    skater Tara Prasad : భారతీయ-అమెరికన్ స్కేటర్ తారా ప్రసాద్‌ను అభినందించిన ఆనంద్ మహీంద్రా

    Skater Tara Prasad : మహీంద్రా కంపెనీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త...

    Bitcoin : ట్రంప్ సంచలనం.. ఇక ‘బిట్ కాయిన్’ రిజర్వ్ లు

    Bitcoin : ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి ఒక కార్యనిర్వాహక ఆర్డర్...