Slum Dog Husband Review :
తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులలో బ్రహ్మాజీ ఒకరు.. ఈయన తనయుడు సంజయ్ రావు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ ఒక పిట్ట కథ.. ఇతడు హీరోగా అడుగు పెట్టిన మొదటి సినిమానే నిరాశ పరిచింది.. దీంతో కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. బ్రహ్మాజీ ఈ సినిమాను బాగానే ప్రమోట్ చేసారు.. నిన్న బ్రో రిలీజ్ అవ్వగా ఈ రోజు ఇతడు నటించిన ”స్లమ్ డాగ్ హస్బెండ్” రిలీజ్ అయ్యింది.. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూ ఒక్కసారి చూద్దాం..
కథ :
హైదరాబాద్ స్లమ్ ఏరియాకు చెందిన లచ్చి (సంజయ్ రావు), మౌనిక (ప్రణవి మానుకొండ) ప్రేమించుకోగా వీరి జాతకాలు కుదరక పోవడంతో లచ్చికి పూజారి సలహా ప్రకారం బేబీ అనే ఒక కుక్కను ఇచ్చి పెళ్లి చేసుకుంటారు.. కుక్కకు వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.. బేబీను పెళ్లి చేసుకున్న తర్వాత వారం రోజులకు మౌనికను పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేయగా బేబీ ఓనర్ కోర్టుకు వెళ్లడం తో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత సినిమా ఎలా సాగింది అనేది మిగిలిన స్టోరీ..
నటీనటులు :
మొదటి సినిమాతో నటన పరంగా మెప్పించిన సంజయ్ ఈ సినిమాలో మరింతగా ఆకట్టుకున్నాడు.. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో లచ్చి పాత్రకు న్యాయం చేసాడు.. ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు మాత్రమే కాదు కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. ఇక హీరోయిన్ ప్రణవి కూడా తన పాత్రకు న్యాయం చేసింది. కమెడియన్ యాదమ్మ రాజు తన పాత్రతో మెప్పించాడు. బ్రహ్మాజీ, సప్తగిరి వంటి కమెడియన్స్ తో ఈ సినిమా చూసే ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు.