
Small Business : వ్యాపారం చేయాలనుకునే వారికి చక్కటి అవకాశం ఉంది. ఇది ఎంతో మందికి తెలియదు. తక్కువ మొత్తంతో ఎక్కువ మొత్తం ఆర్జించే దీని గురించి ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీజన్ ప్రకారంగా చూసినా ఈ బిజినెస్ ప్రతీ సీజన్ లో మంచి రాబడిని తెచ్చి పెడుతుంది. టీ, కాఫీ షాపుల గురించి మనందరికీ తెలిసిందే. నిజానికి టీ స్టాల్ ఏర్పాటుతో చక్కటి ఆదాయమే సమకూరుతుంది. కానీ ఈ బిజినెస్ తో దాని కన్నా ఎక్కువ సంపాదించవచ్చు. దీనికి సంబంధించిన ఓ చక్కటి ప్లాను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గ్రామాలు, పట్టణాల్లో టీ స్టాల్ అనగానే చాయ మాత్రమే ఉంటుందని తెలుసు, అయితే టీ టైం, కాఫీ డే లాంటి ఫ్రాంచైజీలు విస్తృతంగా వెలిశాయి. అందులో కొన్ని రకాల పానీయాలు దొరుకుతున్నాయి. కానీ ఇవి ప్రస్తుతం పట్టణాలకే పరిమితమయ్యాయి. ఇక గ్రామాల్లో సాధారణ టీ స్టాల్ మాత్రమే ఉంటుంది. దీనిలో ఇతర పానియాలను అందుబాటులో ఉంచి మంచి ఆదాయం సమకూర్చుకునే వీలుంటుంది. ఇప్పుడు వేసవిలో బటర్ మిల్క్, లస్సీ వంటివి పెట్టడం ద్వారా అదనంగా ఆదాయం వస్తుంది. వేసవిలో ఈ డ్రింక్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. ఇక వేగంగా లస్సీ, మజ్జికలు చేసేందుకు మిషన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
గ్లాసు లస్సీ ధర రూ. 30 నుంచి రూ. 50 వరకు ఉంటుంది. ఫ్రిజ్ లో ఉంచిన పెరుగును ఇస్టాంట్ మిషన్ లో వేస్తే సరిపోతుంది. కేవలం లస్సీ షాప్ పెట్టుకుంటే ఆదాయం మెరుగుపడకపోవచ్చు. టీ, కాఫీ షాపులో లస్సీ షాపు పెట్టుకుంటే వేసవిలో మాత్రమే అదనపు ఆదాయం సమకూరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో లస్సీ తాగే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆదాయం రాకపోవచ్చు. ఇక పంజాబ్, హర్యాణా రాష్ట్రాల్లో మనం టీ, కాఫీ తాగినంతగా లస్సీ తాగుతారు. అందుకే టీ స్టాల్ తో పాటు లస్సీ, మజ్జిక కూడా పెట్టుకుంటే అదనపు ఆదాయం వస్తుంది.
ఇక లస్సీ తయారు చేసే మిషన్ ధర రూ. 25 వేల నుంచి రూ. 50 వేలు ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ యాప్ లలో తక్కువ ధరకు కూడా లభిస్తున్నాయి. సీజన్లో లస్సీ విక్రయించడం వల్ల రోజుకు రూ. 5 వేల వరకూ అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ. 50వేలు సంపాదించుకోవచ్చు.