
Smart copying in IIT JEE exams.. Phones in underwear! :
ఐఐటీ జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే అయిదుగురు విద్యార్థులు వేర్వేరు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారు.
ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఒక విద్యార్థి సికింద్రాబాద్లోని పరీక్ష సెంటర్లో పరీక్షకు హాజరయ్యాడు. తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా తన మిగిలిన నలుగురు స్నేహితులకు జవాబులు పంపాడు. అయితే పరీక్షా కేంద్రంలోకి వెళ్లే సమయంలో వీరు తమ సెల్ ఫోన్లను లోదుస్తుల్లో పెట్టుకొని వెళ్లినట్లుగా గుర్తించారు. అయితే కేంద్రంలోకి వెళ్తున్నప్పుడే విద్యార్థులను పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తారు. మరి విద్యార్థులు సెల్ ఫోన్ ఎలా తీసుకెళ్లారనే విషయమై ఇప్పుడు అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ విద్యార్థులకు స్థానిక సిబ్బంది ఏమైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెన్త్ , ఇంటర్లలో టాప్ ర్యాంకు సాధించిన ఓ విద్యార్థి తన స్నేహితులకు సహాయం చేయాలని ఈ పథకం రూపొందించాడు. మీరు ఐదుగురు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు.
తాను రాసిన సమాధానాలను ఫోన్లో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో షేర్ చేశాడు అయితే పరీక్షా కేంద్రానికి తనిఖీ కి వచ్చిన ఓ అధికారి సదరు కడప విద్యార్థి తీరును చూసి అనుమానించాడు. వెంటనే అతడిని తనిఖీ చేశాడు. తనిఖీల్లో విద్యార్థి వద్ద సెల్ ఫోన్ లభించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంబంధం ఉన్న ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరికి ఎవరెవరు సహకరించారనే విషయంపై విచారణ చేపడుతున్నారు దర్యాప్తులో పూర్తి విషయాలు వెళ్లడవుతాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని పరీక్షల్లో పాస్ అవ్వాలని చూసిన విద్యార్థులకు చుక్కెదురైంది.
|
ReplyForward
|






