
ఆమెను ఆరాధ్య దేవతగా కొలుస్తారు. బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నా ఏనాడు కూడా తన బాధ్యతలను మరిచిపోలేదు. అటు ఉద్యోగ నిర్వహణ చేస్తూనే ఇటు ఇన్ స్టా గ్రామ్ లో తన అనుభవాలు పంచుకుంటోంది. స్మితా సబర్వాల్ చీరకట్టు అందరికి బాగా నచ్చుతుంది. నిండైన చీరతో లక్ష్మీదేవిలా కనిపించే ఆమెను చూస్తే దండం పెట్టాలనిపిస్తుందని నెటిజన్లు ఆమె కట్టుబొట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
గతంలో కరీంనగర్ కలెక్టర్ గా చేసిన సమయంలో ఎన్నో మంచి పనులు చేసి నగర ప్రజలకు బాగా దగ్గరైంది. ముఖ్యంగా రోడ్డు విస్తరణ ఓ బృహత్తర కార్యక్రమంలా చేపట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసి అందరిలో మంచి ప్రశంసలు అందుకుంది. అప్పట్లో ఆమె బదిలీని చాలా మంది ఆక్షేపించారు. మా కలెక్టర్ గా ఉండాలనే పట్టుబట్టారంటే ఆమె పనితనం ఏపాటిదో అర్థమవుతుంది.
తెలంగాణ ప్రభుత్వ పథకాల్లో ఆమె చేయి ఉంది. పలు పథకాలను తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి కూడా పరోక్ష కారణం ఆమెదే. ఇలా పరిపాలనతో పాటు వ్వవహారాల్లో సైతం స్మితాసబర్వాల్ ది ప్రత్యేక శైలి. అందుకే ఆమెను అందరు ఆరాధ్య దేవతగా కొలవడం మామూలే. ప్రస్తుతం ఆమె సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండటంతో మేడం అంటే మేడమే అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించడం సాధారణమే.
ReplyForward
|