పాముతో బర్రె మిత్ర బంధం ఏంటా అనుకుంటున్నారా.. మరి ఆ మిత్రుడికి కోపం వస్తే ఇక బర్రె సంగతి అంతే కదా.. కానీ ఇక్కడ విచిత్రంగా ఈ రెండు ప్రాణుల మధ్య మిత్ర బంధం కొనసాగుతున్నది. ఆ బర్రె కనిపిస్తే పాము.. ఆ పాము కనిపిస్తే బర్రె స్నేహంగా మెలుగుతున్నాయి. అయితే ఈ రెండు ప్రాణులకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ప్రపంచంలో కొన్ని వైరి ప్రాణుల మధ్య ఒక్కోసారి స్నేహాలు ఇట్టే అర్థం కావు. కుక్క, పిల్లి, కోతి ఇలా ఎన్నో ప్రాణులు తమ స్నేహంతో ఒక్కోసారి ఆకట్టుకుంటాయి. ఇవే మనల్ని సింహాలు, పులులు కూడా కొందరితో స్నేహం చేస్తుండడం మనం వీడియోల్లో గమనిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఓ పాము, ఆవు మధ్య స్నేహం వీడియో బయటికి రావడం, ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. అటవీ అధికారి సుశాంత్ నంద ఈ వీడియోను మొదటిసారి పోస్టు చేశారు.
ఈ వీడియోలో ఏముందంటే ఓ బర్రె, పాము ఎదురెదురుగా కనిపిస్తుంటాయి. అయితే ఇవి రెండు బెదరవు. బర్రెను చూసి పాము బుసలు కొట్టదు. ఆవు తన తలను కిందికి వంచి పామును నాలికతో నాకుతుంది. పాము కూడా అలాగే ఉండిపోతుంది. దీనిని చూసి నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అటవీ అధికారి సుశాంత్ నంద దీనిపై స్పందిస్తూ ఈ బాండ్ ను వివరించడం కష్టం.. పరస్పరమైన నమ్మకమే ఈ రెండు ప్రాణుల మధ్య స్నేహానికి ఊపిరిపోసింది అంటూ కామెంట్ చేశారు. దీనికి మద్దతు పలుకుతూ చాలా మంది వైరల్ చేస్తున్నారు.






