24 C
India
Sunday, October 11, 2026
More

    Snoring : గురక ఎందుకు వస్తుందో తెలుసా?

    Date:

    snore
    snore

    Snoring  : మనలో చాలా మంది గురక పెడుతుంటారు. పడుకున్న తరువాత శ్వాస ముక్కు నుంచి కాకుండా నోటి నుంచి వస్తే గురక వస్తుంది. దీంతో పక్క నున్న వారికి కూడా ఇబ్బందే. వారికి నిద్ర పట్టదు. ఈ నేపథ్యంలో గురక కూడా ఒక రోగమే అని చెబుతారు. ముప్పై ఏళ్ల లోపు వారిలో పది శాతం, అరవై ఏళ్లు దాటిన వారిలో అరవై శాతం మంది గురక సమస్యతో బాధపడుతున్నారు. దీంతో పలు రకాల సమస్యలు వస్తున్నాయి. గురక పక్క నున్న వారికి కూడా ఇబ్బందులు తెస్తుంది.

    మద్యం తాగే అలవాటు ఉన్న వారికి గురక పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట అల్కహాల్ తీసుకోవడం వల్ల గురక సమస్య వేధిస్తుంది. ఇది గొంతు కండరాలను సడలిస్తుంది. వాయుమార్గ అవరోధానికి వ్యతిరేకంగా సహజ రక్షణను తగ్గిస్తుంది. గాలి గదుల్లో బుడిపెలు పెరిగితే ముక్కులోకి జారడం వల్ల గాలి సరిగా ఆడదు. దీంతో నోటితో శ్వాస తీసుకోవాల్సి వస్తుంది. ఇది గురకకు దారి తీస్తుంది.

    నిద్ర లేమి వల్ల కూడా గురక ప్రమాదం ఉంటుంది. గొంతు మరింత సడలిపోయే అవకాశం ఉంటుంది. గొంతుపై గురుత్వాకర్షణ ప్రబావం ఉంటుంది. వాయుమార్గం ఇరుకుగా మారుతుంది. బోర్లా పడుకుంటే కూడా గురక ముప్పు ఏర్పడుతుంది. అధిక బరువు ఉన్న వారికి కూడా గురక వస్తుంది. ఊబకాయం కూడా గురకకు దారి తీస్తుంది.

    ఇంకా కొంత మందికి పొడవైన మృదువైన అంగిలి, పెద్ద టాన్సిల్స్, అడినాయిడ్స్ ఉండటం వల్ల గురక రావడం సహజమే. దీంతో గురక రావడానికి చాలా కారణాలు కనిపిస్తాయి. మెదడులో శ్వాస ప్రక్రియను నియంత్రించే భాగం సరిగా పనిచేయకపోతే నిద్రలో శ్వాస సరిగా ఆడదు. దీంతో గురక వచ్చే ఆస్కారం ఉంటుంది. దీన్ని సెంట్రల్ అప్నియా అంటారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related