Eating radish : మన ఆరోగ్యానికి ముల్లంగి ఎంతో అవసరం. ఇది అన్ని రకాల వారికి అనుకూలంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం ద్వారా రోగాలు నయమవుతాయి. ముల్లంగి అనేక రకాల సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అనేక రంగుల్లో లభిస్తుంది. ఎర్ర ముల్లంగిలో విటమిన్ ఎ,ఇ,సి, బి6, కె ఉంటాయి.
ముల్లంగిలో పొటాషియం, జింక్, కాపర్, కాల్షియం, ఐరన్, మాంగనీసు పుష్కలంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లతో గుండె ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను దూరం చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
రక్తపోటు నియంత్రణలో ఉంచడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచడం వల్ల మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి సాయం చేస్తాయి. ముల్లంగిని ఆహారంలో భాగంగా చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. శరీరం డీ హైడ్రేడ్ కాకుండా నిరోధిస్తుంది.
తలలో ఉండే చుండ్రుకు కూడా చక్కని పరిష్కారం చూపుతుంది. ముల్లంగి పేస్టును తలకు రాసుకో వడంతో చుండ్రు మాయమవుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ తో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు దూరం చేయడంలో ముందుంటుంది. గ్యాస్, ఎసిడిటి, అజీర్తి వంటి సమస్యలను దూరం చేయడంలో కూడా ముల్లంగి తన వంతు పాత్ర పోషిస్తుంది.