
Peanuts : మన ఆరోగ్యానికి మినపప్పు ఎంతో మంచిది. అందుకే దీన్ని ఇడ్లీ, దోశ, వడ వంటి తయారు చేయడానికి వాడుతుంటారు. మినపపప్పు రుచికరంగా ఉంటుంది. పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మన ఆహారంలో భాగంగా చేసుకుంటేనే మంచిది. రోజు మన డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ప్రొటీన్లు, కార్బొహైడ్రేడ్లు, లిపిడ్స్, అమైనో యాసిడ్స్, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉండటంతో ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీ డయాబెటిక్, యాంటీ అలెర్టిక్, యాంటీ మైక్రో బయల్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. దీంతో మినపపప్పును మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి.
మినపపప్పును తరచుగా తీసుకుంటే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. గుండెకు మేలు చేసే ఫైబర్, సపోనిన్లు, ఫైటో స్టెరాల్స్, ఒలిగోశాకరైడ్స్ వంటివి గుండెకు మేలు చేస్తాయి. ఇది డయాబెటిక్ పేషెంట్లకు చాలా మంచిది. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచడంలో ఇది ఎంతో మేలు చేకూరుస్తుంది.
కిడ్నీ, లివర్ కు ఇది సాయపడుతుంది. ఇందులో ఉండే ఫినోలిక్స్, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, సైటిక్ యాసిడ్ వంటివి కిడ్నీ, లివర్ ను రక్షించడంలో సాయపడతాయి. గర్భిణీలకు కూడా ఇది మంచి ఆహారం. జీర్ణక్రియ మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం అవసరం. ఎముకల బలానికి కూడా ఇది ఎంతో అవసరం.






