
uses with ginger : మన వంటింట్లోనే ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి. అందులో మనకు పనికొచ్చేవి ఎక్కువగానే ఉంటాయి. కానీ వాటి గురించి మనకు తెలియదు. దీంతో వాటిని ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద పట్టింపు ఉండదు. మనం రోజు కూరల్లో వాడే వాటిలో అల్లం కూడా ఒకటి. ఇందులో ఎన్నో రకాల ఔషధాలు దాగి ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దాగి ఉన్నాయి.
కార్బోహైడ్రేడ్లు, ఫైబర్, విటమిన్ బి6, సి, ఐరన్, పొటాషియం, మెగ్నిషియం, పాస్పరస్, జింక్, ఫొలేట్, నియాసిన్ వంటి పోషకాలు ఉన్నాయి. అల్లంలో ఉండే ఔషధ గుణాలతో మహిళలకు ఎంతో మేలు కలుగుతుంది. నెలసరి సమస్యలకు చెక్ పెడుతుంది. కడుపు నొప్పి, నడుం నొప్పిలను దూరం చేస్తుంది.
అధిక రక్తస్రావం, కళ్లు తిరగడం, నీరసం, చికాకు, తిమ్మిర్లు వంటి సమస్యలను దూరం చేస్తుంది. రుతుస్రావం సమస్యలకు ఇది మంచి మందులా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో అల్లం టీ తాగితే ఎంతో మేలు కలుగుతుంది. ఇలా అల్లంతో మనకు చాలా రకాల లాభాలు ఉంటాయి.
ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రసవం తరువాత కండరాల ఉపశమనానికి సాయపడుతుంది. మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది. ఇలా అల్లంతో మహిళలకు ఎన్నో రకాల ప్రయోజనాలు దక్కుతాయి.