Software Engineers :
నా కొడుకు, నా మనుమడు, లేదా మనుమరాలు, కూతురు సాఫ్ట్ వేర్ కొలువు చేస్తున్నారు. ఇక వేతనాలకు లోటెక్కడిది.. వేలల్లో కొన్ని రోజుల సీనియర్ అయితే లక్షల్లో జీతాలు అనుకుంటూ ఉంటాం. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ గురించి సిటీలోనే తెలిసేది.. కానీ ఇప్పుడు పల్లెటూర్లలోని ముసలి వారిని అడిగినా చెప్తున్నారు. కానీ కొలువు ఏంటి.? ఎలా చేయాలి.? ఒత్తిడి ఎట్లుంటది మాత్రం ఎవ్వరికీ తెలియదు. చాలా సందర్భాల్లో ‘ఊరెళ్లి పోతా మావా..’ అంటూ పాటలు పాడుకుంటారు ఈ సాఫ్ట్ వేర్ జాతగాళ్లు. వారానికి 5 రోజులే కదా అంటూ అందరూ తీసి పారేస్తున్నా.. ఒక్కో రోజు ఒక్కో యుగంలా అనిపిస్తుంది.
కన్న వారిని, ఉన్న ఊరిని విడిచి పెట్టి జీతం డబ్బుల కోసం జీవితాన్ని పణంగా పెట్టి వెట్టి చారికీ చేయాల్సి వస్తుందని ఎప్పుడూ రోధిస్తూనే ఉంటారు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ప్రాజెక్టులు సరిగా లేవని, ప్రాజెక్టుల్లో ఎర్రర్లు ఉన్నాయని, టైముకు ఇవ్వలేదని ఇలా ప్రతీది ఒత్తిడితో కూడిందే. ఉద్యోగానికి గంటలేటయితే ఒక తంటా.. ముందే వెళ్తే మరో తంటా.. ఇంత కష్టపడి వర్క్ కంప్లీట్ చేసినా పైనుంచి దొబ్బులు, ఇటు టీమ్ లీడ్.. అటు ప్రాజెక్ట్ మేనేజర్. ఇక హెచ్ఆర్ ఇలా ప్రతీ ఒక్కరితో గోసే.
అయితే హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్లేస్, టైంతో సంబంధం లేకుండా రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నారు వీరు. ఒక ఎంప్లాయ్ స్కూటీ ముందు భాగంలో ల్యాప్ ట్యాప్ పెట్టుకొని ట్రాఫిక్ లో ఆగినప్పుడల్లా చేతుల్లోకి తీసుకొని పని చేస్తూనే ఆఫీస్ కు వెళ్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. సాఫ్ట్ వేర్ కొలువు అంటే ఆశామాషీ కాదని, ఇంకా ఇంత కన్నా దుర్భరంగా ఉంటుందని కూడా సాఫ్ల్ వేర్ ఉద్యోగులు కామెంట్లు పెడుతున్నారు.