Syed Sohel :
జీవితంలో ఒడిదుడుకులు సహజం. జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు. కష్టాలకు ఎదురొడ్డి నిలవాలి. అప్పుడే విజయం మన దాసోహం అవుతుంది. చీకటిని చూసి భయపడే బదులు ఆ చీకటిలో ఓ చిరుదీపం వెలిగించడం మంచిది. మోచేతిలో బలముంటే మొండి కొడవలైనా తెగుతుంది. అలాగే ఎవరి ఎదుగుదలను వారే తీసుకోవాలి. కష్టాలను గుర్తు చేసుకుని బాధపడే బదులు వాటి నుంచి బయటపడే అవకాశాలను వెతుక్కోవడం తెలివిగల వారి లక్షణం.
తెలుగు సినిమాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటుడు సోహెల్. బిగ్ బాస్ షోలో అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు ఎదురైన కష్టాలను తలుచుకుని బాధ పడ్డాడు. తనను తేడా అని అనుకున్నారు. ఆ మాటలు విని కలత చెందాను. మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా గ్లింప్స్ సమయంలో వీడు తేడా గాడా అనే చాలా మంది మాట్లాడుకోవడం చూసి ఆందోళన చెందాను.
చిన్న స్క్రీన్ నుంచి రావడంతో షో లో అందరు హేళనగానే చూశారు. తనకు జరిగిన అవమానంతో ఎంతో దిగులు కలిగింది. రియాలిటీ షో లో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ఇలాంటి మాటలు విని దిగులు చెందానని సోహెల్ అసహనం వ్యక్తం చేశాడు.
ఈ నేపథ్యంలో సోహెల్ తనకు ఎదురైన కష్టాలను తలుచుకుని సోహెల్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన ఎదుగుదలకు ఎంతో కష్టపడ్డానని వేదన చెందాడు. కొత్త వారిని అంత తేలిగ్గా రిసీవ్ చేసుకోరు. మనం ఎన్నో మెట్లు ఎక్కాలి. అవమానాలను దాటుకోవాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యం చేరుతాం. దానికి చాలా సహనం కావాలి. అన్నింటిని తట్టుకుంటనే మనుగడ సాధ్యం అవుతుంది.