Sonu Nigam సోనూ నిగమ్.. ఈయన గురించి ఇండియా వ్యాప్తంగా అందరికి తెలుసు.. సింగర్ గా ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించు కున్నాడు.. ఇతడు ఎక్కువుగా బాలీవుడ్ లో సాంగ్స్ ఆలపించిన కూడా ప్రపంచ వ్యాప్తంగా సోనూ నిగమ్ కు ఫ్యాన్స్ ఉన్నారు.. సింగర్ గా మాత్రమే కాదు సోనూ నిగమ్ నటుడిగా, వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
ఈయన హిందీ సాంగ్స్ తో పాటు.. బెంగాలీ, గుజరాతీ, నేపాలీ, తుళు, మైథిలీ, ఒరియా, మరాఠీ, తమిళ్, తెలుగు, కన్నడ వంటి అనేక భాషల్లో సాంగ్స్ పాడారు.. అంతేకాదు ఎన్నో రకాల పాప్ సాంగ్స్ ను కూడా విడుదల చేసి ఈయన టాప్ సింగర్స్ లిస్టులో చేరిపోయాడు..
ఇక ప్రస్తుతం సోనూ నిగమ్ ఇండియా లోనే అత్యంత పారితోషికం అందుకుంటున్న సింగర్స్ లిస్టులో కూడా టాప్ లో ఉన్నాడు.. అలా తన సాంగ్స్ తో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.. అలాగే ఈయన హిందూ, ముస్లిం, బౌద్ధ మతానికి సంబంధించిన భక్తి గీతాల ఆల్బమ్స్ కూడా రిలీజ్ చేసారు.
అలాగే చాలా దేశాల్లో ప్రదర్శనలిచ్చారు.. ఒక ఇండియన్ సింగర్ ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వడం ఈయనే తొలిసారి స్టార్ట్ చేసారు. అంతేకాదు ఈయన చుట్టూ చాలా వివాదాలు కూడా జరిగాయి.. ముస్లింలు పెద్ద పెద్ద శబ్దాలతో ప్రార్ధన చేయడం తనకు నిద్ర డిస్టర్బ్ అవుతుందని ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు.
ఆ తర్వాత బెంగాల్ ఐక్య మైనారిటీ సమితి అధ్యక్షుడు సయ్యద్ అలీ తలను గుండు గీసిన వారికీ 10 లక్షలు నజరానా అంటూ ప్రకటించి మరో వివాదం సృష్టించాడు.. ఇలా ఈయన చాలా పాపులారిటీ పొందినప్పటికీ అప్పుడప్పుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి..