26.3 C
India
Wednesday, September 16, 2026
More

    ‘Kartikeya 3’ : త్వరలో ‘కార్తికేయ 3’.. క్లారిటీ ఇచ్చిన మూవీ యూనిట్

    Date:

    Kartikeya 3'
    Kartikeya 3′

    ‘Kartikeya 3’ హీరో నిఖిల్, డైరెక్టర్ చందూ మొండేటి కాంబోలో వచ్చిన సినిమా ‘కార్తికేయ 2’. ఈ సినిమా ఏ మేరకు బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. దీనికి నిర్మాతలుగా అఖిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ వ్యవహరించారు. 2022, ఆగస్ట్ 13న  పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ నటించగా, మిగిలిన పాత్రల్లో అనుపమ్ కేర్, ఆదిత్య మీనన్, సత్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. 2022లో భారీ హిట్లు సాధించిన సినిమాల్లో కార్తికేయ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీమ్ సెలబ్రేషన్స్ చేసుకుంది.

    కార్తికేయ 2 రిలీజై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హీరో నిఖిల్ తో పాటు టీమ్ మొత్తం సందడిగా గడిపారు. తెలుగు మీడియా రివ్యూలతోనే పాన్ ఇండియా లెవల్ లో మంచి ఆదరణ లభించిందని తెలిపారు. ఈ సినిమాపై తెలుగు ఆడియన్స్, మీడియా చూపిన మమకారం మరువలేనిదన్నారు. ఆ సమయంలో కలుసుకోలేకపోయాం అని బాధపడినా.. ఇప్పుడు కలుసుకున్నందుకు ఆనందంగా ఉందని యూనిట్ చెప్పింది.

    దర్శకుడు చందూ మాట్లాడుతూ.. ‘కార్తికేయ-2 విజయం ఆనందాన్ని ఇచ్చింది. దీంతో పాటు ఓల్ టీమ్ లో మరింత విశ్వాసం నింపింది. దీన్నే స్ఫూర్తిగా తీసుకొని త్వరలో ‘కార్తికేయ-3’ని కూడా తీసుకుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. నాకు కూడా రెండు సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తయిన తర్వాత కార్తికేయ 3 ని సెట్స్ పైకి తీసుకెళ్తాం’ అన్నాడు.

    నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. ‘నిఖిల్, చందూ కాంబోకు గుర్తింపు వచ్చంది. తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ 2 ఘన విజయం సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో కూడా ఆకట్టుకుంది. వీరి కార్తికేయ 3కి కూడా అన్ని పరిస్థితులు కలిసి వస్తే నేనే నిర్మాతగా ఉంటాను. సెలబ్రేషన్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అన్నారు.

    ఇక కార్తికేయ-2 వసూళ్ల విషయానికి వస్తే కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయగా, ప్రమోషన్, ఇతర ఖర్చులు కలిపి రూ. 25 కోట్లయ్యింది. ఈ సినిమా మాత్రం ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో రూ. 121 కోట్లు రాబట్టింది. అప్పట్లో ఇది ట్రేడ్ వర్గాలను తీవ్ర విశ్మయానికి గురి చేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Swayambhu : స్వయంభూ ఒక్క సీన్ కే అన్ని కోట్ల ఖర్చా..?

    Swayambhu Movie : నిఖిల్ నటిస్తున్న మూవీ స్వయంభూ..  ఇప్పటివరకు నిఖిల్ తీసిన...

    Hero Nikhil : తండ్రి అయిన టాలీవుడ్ హీరో నిఖిల్.. పండంటి మగ శిశువుకు జన్మనిచ్చిన పల్లవి..

    Hero Nikhil : యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య...

    HERO NIKHIL : నిఖిల్ ‘స్పై’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. హిట్టా ? ప్లాపా?

    HERO NIKHIL : యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నిఖిల్ సిద్ధార్థ్...