Kodali Nani :
ఏ ఒక్క అవకాం దొరికినా టీడీపీ, చంద్రబాబు మీద విరుచుకపడే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పరిస్థితి దయనీయంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లను కూడా ఇవ్వలేని పరిస్థితి. కట్టిన ఇళ్లను నాలుగేళ్లయినా ఇవ్వకపోవడమేంటని లబ్ధిదారులు ఆరా తీస్తున్నారు.
గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం హయాంలో టిడ్కో ఇళ్లను నిర్మించగా కేటాయింపు కూడా పూర్తయ్యింది. రోడ్లు, కరెంట్ , ఇతర సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అప్పగించే సమయానికి ప్రభుత్వం మారింది. నాలుగేళ్లవుతున్నా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇళ్లను మాత్రం లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఎలాగూ ఎన్నికలు వస్తుండడంతో ఈ క్రెడిట్ వైసీపీ కొట్టేయాలని చూస్తున్నది. ఇంకేముంది ఇళ్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అసలు చిక్కు ఇక్కడే ఉంది. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనులు ఎక్కడ ఆగిపోయాయో ఇప్పుడు అక్కడే ఉన్నాయి. అంగుళం అదనపు పని కూడా చేయలేదు. కానీ సీఎం జగన్ వచ్చి ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లు ఏమిటంటే అక్కడ ఒక వైఎస్ విగ్రహంపెట్టడం, ఇండ్లకు కొత్తగా వైసీపీ ని గుర్తు చేసేలా నీలి రంగులు వేయడం, జగన్ ఫ్లెక్సీలు మాత్రమే కనిపించేలా చేయడం. ఇవి వైసీపీ చేసిన ఏర్పాట్లు. కానీరోడ్లు..కరెంట్ ఉండాలి కదా అనే విషయాన్ని మార్చిపోయారు. సీఎం జగన్ ప్రారంభించడానికైనా ఆ ఏర్పాట్లు లేకపోతే ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతాయని, నాలుగేళ్లలో ఏం చేయకుండానే కేవలం రంగులు వేసి ఇస్తారా అని మండిపడతారన్న ఉద్దేశంతో ఆగిపోయారు.
అమరావతిలో చంద్రబాబు హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను ఇటీవల ప్రారంభించారు. అందులో నీరు.. కరెంట్, ఇతర మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు శాపనార్ధాలు పెట్టారు. గుడివాలో కూడా అలాంటి పరిస్థితి రాకుండా సీఎం జగన్ ఈ పర్యటన వాయిదా వేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం కొడాలి నాని ప్రయత్నిస్తున్నారు. ప్రతీ ఊరికి వాహనాలను ఏర్పాటు చేశారు. చివరి క్షణంలో సీఎం పర్యటన రద్దయినట్లు తెలిసింది. దీంతో వైసీపీ నేతలంతా ఊసూరుమంటున్నారు.ఇక తన పరువుపోయిందని నాని ఫీలవుతున్నారు. అన్ని ఇళ్లనూ పూర్తి చేసిన తర్వాతే ప్రారంభిస్తున్నారా.. నా విషయంలో ఎందుకిలా చేస్తున్నారంటూ నాని పార్టీ శ్రేణుల వద్ద అసహనం వ్యక్తం చేస్తన్నట్లు సమాచారం.
|
ReplyForward
|






