
రాశీ ఖన్నాకు హారర్ జానర్ అంటే చాలా ఇష్టమట. ఆత్మలు, దెయ్యాలు అంటే ఇంట్రస్ట్ అని అందుకే ఆమె ‘అరుణ్‌మణై’ పార్టులో నటించేందుకు ఇంట్రస్ట్ చూపింది. దీంతో దర్శకుడు సుందర్ సి ఆమెకు ‘అరుణ్‌మణై 3’లో ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ‘అరుణ్‌మణై 4’లో కూడా నటిస్తుందట. ఆత్మల నేపథ్యంలో సాగే మూడు పార్టులు ఇప్పటి వరకూ బాక్సాఫీస్ కలెక్షన్లను రాబట్టాయి. ఇక నాలుగో పార్టు కూడా షూటింగ్ దశలో ఉంది. ఇందులో రాశీఖన్నా ఇప్పటికే నటిస్తుండగా మరో హీరోయిన్ తమన్నాను తీసుకున్నారు. పార్టు 3లో ఆండ్రియా ఆత్మ కాగా.. అరుణ్ మణై 4లో తమన్నా ఆత్మ అని సమాచారం.
ప్రేతాత్మగా సమంత..
ఇక సందీప్ కిషన్ హారోగా చేస్తున్న సినిమా ‘ఊరు పేరు భైరవకోన’. అంతు చిక్కని రహస్యాలు ఉన్న గ్రామం భైరవకోన అనే కథాంశంతో సాగుతుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. హారర్ బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరిస్తున్న ఈ సినిమా ఆత్మల నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా త్వరలో విడుదల అవనుంది.
డిటెక్టివ్ కావాలనుకుంటున్న ఒక యువకుడు ప్రేమసితో ఆనందంగా ఉన్న సమయంలో లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. రాత్రి వేళ రాకపోకలు నిషేధించిన మారేడు కోనకు ఆ యువకుడు వెళ్లాల్సి వస్తుంది. అసలు ఆ యువకుడు ఆ గ్రామానికి ఎందుకు వెళ్లాడు.. అసలు అక్కడ ఏం జరిగింది. అనే కథాంశంతో సాగే ఈ చిత్రం ‘అన్వేషి’. వీజే ఖన్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ ధరణ్ దాట్ల హీరోగా, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగెళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా హారర్ జానర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి.






