
Sowmya Menon : సూపర్ స్టార్ మహేశ్ బాబు లాస్ట్ మూవీ ‘సర్కారువారి పాట’ గుర్తింది కదా?. కీర్తి సురేశ్ హీరోయిన్ గా చేసిన ఈ మూవీని పరశురామ్ డైరెక్ట్ చేశాడు. కమర్షియల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇందులో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ నటించారు. ఇందులో కీర్తి సురేశ్ కు ఫ్రెండ్ గా నటించిన అమ్మాయి గురించి తెలుసా? ఆమె గురించి తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఆమె బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకుందాం..
‘సర్కారు వారి పాట’తో కీర్తి సురేశ్ కు ఫ్రెండ్ గా నటించింది సౌమ్య మీనన్. మోడలింగ్ నుంచి వచ్చింది ఈ అమ్మడు. మహేశ్ బాబు అంటే సౌమ్యకు పిచ్చి ఎలాగైనా ఆయన పక్కన నటించాలని అనుకుంది. ఆమెకు అదృష్టం ఈ సినిమా ద్వారా కలిసి వచ్చింది. ఈ మూవీలో కనిపించింది చిన్న పాత్రలోనే అయినా మంచి నటన కనబరిచి మెప్పించింది. మలయాళంలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కినవల్లి, చిల్డ్రన్స్ పార్క్, ఫ్యాన్సీ డ్రెస్ మూవీల్లో చేసింది. దీంతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీ ‘సర’లో కూడా నటించింది. దీనికి దర్శకత్వం వీ శశిభూషణ్. ఈ సినిమాలో సౌమ్య డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుంది. భిన్నమైన కథతో తెరకెక్కింది.
ఇక ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. తన పిక్, వీడియోలు పెడుతూ ఫ్యాన్స్ రెచ్చకొడుతూ సందడి చేస్తుంది. టాక్సీ మూవీ కంటే ముందు ‘సర్కారు వారి పాట’ రిలీజ్ కాడడంతో ఈ సినిమాతోనే తనకు గుర్తింపు దక్కింది. కేవలం నటి మాత్రమే కాదు. డాన్సర్ కూడా.. మలయాళంలో సాంగ్స్ చేసింది. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించి మెప్పించింది ఈ సుందరి.