
SP Balu Lifetime : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం.. మనం ముద్దుగా బాలు గారు అని పిలుచుకుంటాం అనే విషయం తెలిసిందే.. ఈయన గురించి తెలియని వారు లేరు.. దేశ వ్యాప్తంగా కాదు కాదు ప్రపంచ వ్యాప్తంగా బాలు గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఈయన గానం వింటే చాలు చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది.. ఎన్నో వేల పాటలను ఆలపించిన గానం మూగబోయిన విషయం విదితమే..
1946 జూన్ 4న జన్మించిన బాలు గారిది ఈ రోజు 77వ జన్మదినం.. ఆయన బ్రతికి ఉంటే ఎన్నో అభినందనలు అందుకునే వారు.. కానీ ఈయన మనకు దూరం అయ్యారు.. ఆయన మనిషి రూపంలో దూరం అయిన కూడా పాట రూపంలో ఎప్పుడు జీవించే ఉంటారు. మ్యూజిక్ లవర్స్ ఇప్పటికి బాలు గారి పాటలను రోజు వింటూ ఆయన గానం మరణించలేదని భావిస్తారు..
ఈ సంగీతం దిగ్గజం గాన గాంధర్వుడు సంగీత విభావరి 1966లో కెరీర్ స్టార్ట్ చేసాడు.. అప్పుడు మొదలు పెట్టిన ఈయన కెరీర్ మరణించే వరకు కొనసాగుతూనే ఉంది.. బాలు గారు సింగర్ గా మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్ గా, డబ్బింగ్ ఆరిస్టుగా, హోస్ట్ గానే కాకుండా నటుడిగా కూడా అద్భుతమైన పాత్రలు పోషించారు. ఈయన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 40 వేలకు పైగానే పాటలు 11 భాషల్లో పాడారు..
ఎన్నో అవార్డులను అందుకున్నారు.. ఏపీ ప్రభుత్వ నంది పురస్కారాన్ని ఏకంగా 29 సార్లు అందుకున్నారు. అయితే ఆగస్టు 5న ఈయన కరోనా బారిన పడడంతో అప్పటి నుండి కోలుకోలేక సెప్టెంబర్ 29న మరణించారు. ఇదిలా ఉండగా ఈయన 77వ జయంతి సందర్భంగా కళాదర్బార్ ఆంధ్రప్రదేశ్ అండ్ ది ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్టు వారు ఎస్. పి. బాలు జీవిత సాఫల్య పురస్కారాల బహుకరణ వేడుక జరపనున్నారు. గుంటూరు వేదికగా ఈ అవార్డులను ఈ రోజు సాయంత్రం అందజేయనున్నారు.
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జీవిత సాఫల్య పురస్కారాలను ప్రధానం చేశారు. ఇందులో యూబ్లడ్ తో సమాజసేవ చేస్తున్న ఆ యాప్ అధినేత డా. యలిమంచిలి జగదీష్ బాబు గారికి ఈ ప్రతిష్టాత్మక లైఫ్ టైం అవార్డ్ అవార్డును అందజేశారు. ఈయనతో పాటు పలువురు ప్రముఖులకు ఈ అవార్డు అందజేశారు.






