- ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న ఆయా దేశాలు..

Space Tourism : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ పేరు ప్రస్తుతం ప్రపంచం పటిస్తోంది. ప్రపంచలోనే ఇప్పటి వరకు ఎవరూ చేయని ఘనత ఇస్రో సాధించింది. జాబిల్లిపై చేసిన రెండు మిషన్లు కూడా భారీగా సక్సెస్ అయ్యయి. కొన్నేళ్ల కింద చంద్రుడిపైన జరిపిన పరిశోధనల్లో అక్కడ నీరు ఉందన్న సత్యాన్ని ప్రపంచానికి చెప్పిన ఇస్రో ఇప్పుడు, చంద్రయాన్ 3ని సక్సెస్ చేసి ప్రపంచమే అబ్బుర పొయేలా చేసింది.
చంద్రయాన్3 సక్సెస్ కావడంతో పాటు ప్రజ్ఞాన్ రోవర్ 100 మీటర్లకు పైగా సంచారం కూడా సాగించి రికార్డు నెలకొల్పింది. ఇదే ఊపులో ఇస్రో మొన్నటికి మొన్న ఆదిత్యుడి (సూర్యుడు) గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ‘ఆదిత్య ఎల్1’ను ప్రయోగించింది. ఇప్పటి వరకు ఇది కూడా విజయవంతమనే చెప్పవచ్చు. ఇదే ఊపులో మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దాని గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ‘స్పేస్ టూరిజం’ను ప్రారంభించాలని అనుకుంటుంది. ఇందులో భాగంగా ఒక్కో ప్యాసింజర్ రూ. 6 కోట్లు కట్టాలని రేటును కూడా నిర్ణయించింది. 2030 వరకు స్పేస్ టూరిజంను అందుబాటులోకి తెస్తామని చెప్పింది. ఇంట్రస్ట్ ఉన్న వారు ఆస్ట్రోనాట్స్ ను కలిసి ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలని వివరిస్తుంది. దీన్ని ఇంత వరకు ప్రపంచలోని ఏ దేశం ప్రారంభించలేదు సరికదా.. కనీసం అనౌన్స్ కూడా చేయలేదు. కానీ ఇస్రో మాత్రం అనౌన్స్ చేయడంతో పాటు కొత్త చరిత్ర సృష్టించేందుకు ముందుకు వేసింది.
దీనికి సంబంధించిన ఒక ప్రకటన కూడా ఇస్రో రిలీజ్ చేసిందని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది కనుక సక్సెస్ అయితే ప్రపంచంలో భారత్ తర్వాతే ఇతర దేశాలు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు.