
Split in the votes in Karnataka 2023 Assembly Elections : నేడు కర్ణాటకలో వెలువడుతున్న ఫలితాల్లో కాంగ్రెస్ క్లీన్ విక్టరీ దిశగా వెళుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ, జేడీఎస్, స్వతంత్రులు ఉన్నారు. అయితే ఎన్నికల రిజల్ట్ ను పరిశీలిస్తే జేడీఎస్.. బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ బలంగా చీలినట్లు కన్పిస్తోంది.
లింగాయత్ ఓట్లలో చీలిక..
రాష్ట్రంలో లింగాయత్ ల ఓట్లు ఎప్పుడూ బీజేపీ ఖాతాలోనే ఉండేవి. కానీ ఈ సారి అంచనా మారింది. లింగాయత్ ఓట్లు 30 శాతం వరకు కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకులో కలిసిపోయినట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లింగాయత్ జనాభాలో 30 నుంచి 40 శాతం ఓట్లు బీజేపీని వదిలివేసి కాంగ్రెస్ వైపు మళ్లినట్లు అంచనా వేస్తున్నారు.
దళితుల మద్దతు కాంగ్రెస్ కే..
ఎస్సీ వర్గం ఓట్లు గతంలో బీఎస్పీకి మద్దుగా ఎవరు నిలుస్తారో వారికి పడేవి. కానీ ఈ సారి ఆ అంచనా కూడా తప్పింది. 2019 ఎన్నికల్లో ఈ ప్రభావం చాలా వరకు తగ్గింది. ఈ సారి దళితవర్గం ఓట్లు అన్నీ గంపగుత్తగా కాంగ్రెస్ కు మళ్లినట్లు తెలుస్తోంది. రాష్ర్టంలోని ప్రధాన పార్టీలపైనే వారు దృష్టి పెట్టాలని అనుకోవడం కాంగ్రెస్ కు ప్లస్ అయ్యింది.
బీజేపీని అవే దెబ్బతీశాయి..
నిత్యావసరాల ధరల పెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్తితి, నిరుద్యోగం, పట్టణ ప్రాంతాల్లో తాగునీరు ఇలా చాలా సమస్యలు ఈ సారి బీజేపీని దెబ్బ తీశాయి. ఐదేళ్ల కాలంలో ఆ రాష్ట్ర మౌలిక అవసరాలపై బీజేపీ గట్టి ఫోకస్ చేయకపోవడమే ఇప్పటి ఫలితాలకు కారణంగా తెలుస్తోంది. ఈ విషయాలను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో ప్రత్యేకంగా విశ్లేషించింది. దీని కారణంగా బీజేపీ ఈ సారి అధికారం కోల్పోతుందని అంచనా వేసింది.
‘40 శాతం సర్కార్’ ఫలితంచింది..
బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ‘40 శాతం సర్కార్’ కమీషన్ నినాదం మంచి ఫలితాలిచ్చింది. కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సఫలమైందనే చెప్పాలి. దీనికి తోడు ఆ పార్టీ ప్రకటించిన ఆకర్షనీయమైన మేనిఫెస్టో కూడా లాభం చేకూర్చింది. ఇక మరో అంశం గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే ప్రభుత్వం మారేలా చేసింది.
ఎస్సీ, ఎస్టీ సీట్లలో భారీ మెజారిటీ
ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ లెక్కడ ఆ వర్గాల వారి ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో పడినట్లు తెలుస్తోంది.
ప్రజలు బీజేపీతో విసిగిపోయారు సిద్ధ రామయ్య
కర్ణాటకలో మోడీ, అమిత్ షా ప్రచారం మార్పు తేలేకపోయిందని సిద్ధ రామయ్యా అన్నారు. బీజేపీతో ప్రజలు విసిగిపోయారన్నారు. తాను మొదటి నుంచి చెబుతున్నది నిజమైందని సిద్ధ రామయ్య విశ్లేషించారు.