SPY Movie : ‘ తక్కువ సినిమాలతోనే ఎక్కువ గ్రాఫ్ సంపాదించుకున్నాడు నిఖిల్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. హ్యాపీడేస్ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్ లో వచ్చిన నిఖిల్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీకి చెందిన ఆయన నటనలో వారసులను మించి పోయాడంటే అతిశయోక్తి కాదు. ‘కార్తికేయ2’ భారీ విజయం దక్కించుకొని నిఖిల్ ను పాన్ ఇండియా యాక్టర్ గా నిలబెట్టింది.
ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్న నిఖిల్ భారీ ప్రాజెక్టులకు ఒకే చెప్తూ తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు వరకు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఆయన రీసెంట్ గా చేసిన ‘స్పై (SPY)’ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది. భారీ అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా అవతారమెత్తారు. ఆయన నిఖిల్ తో తీసిన సినిమానే ‘స్పై’. ఈ మూవీకి సంబంధించి అమెరికా ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. దీంతో సినీ ప్రేమికులు, నిఖిల్ ఫ్యాన్స్ థియేటర్ బాట పడుతున్నారు. దీంతో మంచి స్పందనే వస్తుంది. భారీ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసే దిశగా మూవీ సాగుతుందని తెలుస్తుంది. థియేటర్ గురించి పక్కన పెడితే ఓటీటీ డీల్ గురించి, స్ట్రీమింగ్ డేట్ గురించి కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.
స్వాతంత్ర సమరయోధుడు సుభాస్ చంద్రబోస్ డెత్ మిస్టరీని టచ్ చేస్తూ తీసిన సినిమా ‘స్పై’. భారీ అంచానాలు రావడంతో డిజిటల్ హక్కుల కోసం తీవ్రంగా పోటీ ఎదురైంది. ఈ సినిమా హక్కులను ఓటీటీ ధిగ్గజం ‘అమేజాన్ ప్రైమ్’ సొంతం చేసుకుంది. దీని కోసం భారీగానే చెల్లించిందట. అయితే థియేటర్ లో రిలీజైన డేట్ (జూన్ 29) నుంచి 50 రోజుల తర్వాతనే ఈ సినిమాలో అమేజాన్ లో అందుబాటులో ఉంటుందని మేకర్స్ తెలిపారు. అంటే ఆగస్ట్ 3వ వారంలో ఈ సినిమాను ఓటీటీలో చూడవచ్చు అన్నమాట.
స్పైలో ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ అఖిల్ కు జోడీగా నటించారు. ఆర్యన్ రాజేశ్, అభినవ్ గోమటం లీడ్ రోల్స్ లో కనిపించారు. ‘ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి దీన్ని నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ బాణీలు సమకూర్చారు.
