SPY OTT Release :
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చాలా కాలంగా వరుస హిట్స్ తో దూసుకు పోతున్న నిఖిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అందుకే వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు. నిఖిల్ పాన్ ఇండియా రేంజ్ లో కార్తికేయ 2 తో హిట్ అందుకున్నాడు.. ఈ సినిమా విజయం తర్వాత వెంటనే 18 పేజెస్ తో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.
ఇలా వరుసగా రెండు హిట్స్ అందుకుంటూ ఉత్సాహంగా ఉన్న నిఖిల్ ‘స్పై’ సినిమాతో హ్యాట్రిక్ విజయం అందుకోవాలని అనుకున్నాడు. ఈ పాన్ ఇండియన్ మూవీ యాక్షన్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా ఈ సినిమా జూన్ 29న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. చాలా కాలంగా వరుస హిట్స్ తో దూసుకు పోతున్న నిఖిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అందుకే వరుస సినిమాలను ప్రకటిస్తున్నాడు.
ఇక స్పై సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాను బిహెచ్ గ్యారీ డైరెక్ట్ చేయగా అనుకున్న స్థాయిలో హైప్ చూపించలేక పోయాడు. ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీను రాజశేఖర్ రెడ్డి ఈడీ ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. మరి ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చి ఫ్యాన్స్ కు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది.
ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ కోసం ముందుగా ఎలాంటి ప్రకటన చేయలేదు.. సడెన్ గా ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.. ప్రముఖ ఓటిటి వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా గురువారం నుండి తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
ReplyForward
|