‘Spy’ Movie Review : యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నిఖిల్ సిద్ధార్థ్ తాజాగా నటించిన పాన్ ఇండియన్ మూవీ ‘స్పై’.. యాక్షన్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై గత కొద్దీ రోజుల నుండి మాములు చర్చ జరగడం లేదు.. ఎట్టకేలకు అన్ని అండ్డంకులను అధిగమించి ఈ రోజు జూన్ 29న ఈ సినిమా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా రివ్యూ అండ్ రేటింగ్ పై ఓ లుక్కేద్దాం..
కథ :
ఈ సినిమా కథ మొత్తం టెర్రరిస్టుల చుట్టూనే తిరుగుతుంది.. జయ్ ( నిఖిల్ ) అనే రా ఏజెంట్ టెర్రరిస్టు ఖదీర్ ఖాన్ కు చెక్ పెట్టే పనిలో ఉంటూనే తన తమ్ముడు సుభాష్ ( ఆర్యన్ రాజేష్) ను ఎవరు చంపారో కనిపెట్టడమే ఈయన పని.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన ఫైల్స్ మిస్సింగ్ కావడం.. ఇలా తన అయిదేళ్ల ప్రయాణంలో మూడు కోణాల్లో జయ్ ఎలా పరిష్కరించాడు అనే అంశాలతో కథ సాగుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్ :
నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నాడు.. ఎందుకంటే ఈయన పాన్ ఇండియా రేంజ్ లో కార్తికేయ 2 తో హిట్ అందుకున్నాడు.. ఇక స్పై సినిమాలో నటించిన పాత్రలో నిఖిల్ మునుపెన్నడూ నటించలేదు.. కార్తికేయ సినిమా చూసిన వారంతా మంచి హోప్స్ పెట్టుకుని ఈ సినిమాకు వెళితే కష్టమే.. ఎందుకంటే నిఖిల్ పర్ఫార్మెన్స్ ఆశించిన స్థాయిలో మెప్పించలేక పోయింది.
ఏజెంట్ పాత్రకు తగ్గ హావభావాలను ఈయన తన నటనలో పలికించలేక పోయాడు.. ఇక చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చేసిన వారు లేరు అనే చెప్పాలి. ఐశ్వర్య మీనన్ ఎన్ఐఏ ఏజెంట్ గా పర్వాలేదు అనిపించింది. ఖదీర్ ఖాన్ గా నితిన్ మెహతా కూడా పర్వాలేదు అన్నట్టు అనిపించాడు.
టెక్నీకల్ పరంగా చూస్తే..
ఈ సినిమాను బిహెచ్ గ్యారీ డైరెక్ట్ చేయగా అనుకున్న స్థాయిలో హైప్ చూపించలేక పోయాడు. బడ్జెట్ ఆశించిన స్థాయిలో లేనప్పుడు డైరెక్షన్ పరంగా మెరుగులు దిద్దుకోవాలి.. కానీ ఈయన ఆ లెవల్ స్కిల్స్ చూపించలేక పోయాడు.. మంచి సబ్జెక్ట్ ను ఎంచుకున్నప్పటికీ సీన్స్ నార్మల్ గా అనిపించాయి.. ఎడిటింగ్ ఇంకాస్త బాగా వచ్చి ఉంటే బాగుండేది.. అలాగే కెమెరా పని తనం బాగానే ఉంది. కానీ సంగీతం అలరించలేదు. బీజీఎమ్ ఏమాత్రం మెప్పించలేదు.
ప్లస్ పాయింట్స్ :
నిఖిల్ ఇమేజ్
సుఖష్ చంద్రబోస్ కు సంబందించిన సీన్స్
మైనస్ పాయింట్స్ :
పేలవమైన దర్శకత్వం
ఆకట్టుకొని సన్నివేశాలు
సంగీతం
చివరి మాట..
ఈ సినిమాలో కథ, కథనం బాగుంది కానీ ఆ కథకు తగ్గట్టు సీన్స్ లేవు.. డైరెక్షన్ కూడా బాలేదు.. ఓవరాల్ గా ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. అయితే ఒకసారి చుసేయోచ్చు..
రేటింగ్ : 2.25/5
ReplyForward
|