
Sr NTR centenary celebrations : అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో తెలుగింటి అన్నగారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మే 19న రాత్రి జరిగిన ఈ వేడుకలకు అక్కడి తెలుగు వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘బే ఏరియా గళం’ గా పేరొందిన విజయ ఆసూరి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ప్రతీ తెలుగు వారికి గర్వకారణం : జస్టిస్ ఈవీ వేణు గోపాల్
ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా నిర్వహించడం ప్రతి తెలుగు వారికీ గర్వకారణమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ తెలుగు గడ్డపై జన్మించడం తెలుగోళ్లందరికీ గర్వకారణమని కొనియాడారు. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీకను దశ దిశలా చాటాడని గుర్తు చేసుకున్నారు. టీడీపీ ని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి కొత్త శకానికి నాంది పలికారని కొనియాడారు.కిలో రెండు రూపాయలకే బియ్యం ఇచ్చి పేదల ఆకలి తీర్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. జస్టిస్ వేణుగోపాల్ చేసిన ప్రసంగానికి ప్రేక్షకులు తమ సీట్ల నుంచి లేచి కరతాళ ధ్వనులు మోగించారు.
ఆత్మగౌరవానికి ప్రతీక డాక్టర్ నాగేంద్ర ప్రసాద్..
తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అని దౌత్యకార్యాలయ అధికారి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆయన ఎక్కడున్నా తెలుగు వారి కోసం పరితపించారని గుర్తు చేసుకున్నారు. తన చిన్నతనంలో ఎన్టీఆర్ సినిమాలను చూసిన జ్ఞాపకాలని గుర్తు చేసుకొన్నారు
తెలుగు కోసం పరితపించిన శక్తి : జయరాం కోమటి
తెలుగు నేల కోసం, తెలుగు వారి కోసం పరితపించిన ఏకైక వ్యక్తి, శక్తి ఎన్టీఆరేనని ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ జయరాం కోమటి అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేసుకోవడం మనందరి భాగ్యమని చెప్పారు. ప్రతి తెలుగు వ్యక్తీ గర్వపడేలా చేసిన ఏకైక వ్యక్తి ఎన్టీఆరేనని గుర్తు చేసుకకున్నారు. 2022 మే 28 నుంచి అమెరికా లో ప్రతి నెలా ఒక నగరంలో వేడుకలు జరుగుతున్నాయనన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 100 నగరాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఒక వ్యక్తి జయంతి వేడుకలు ఇంత పెద్ద మొత్తంలో నిర్వహించడం ఇదే మొదటిదని అన్నారు.
కార్యక్రమంలో విలేఖ్య వెనిగళ్ల, కొర్ర జానకీ దేవి, చేతన మారిపూరి, నీలిమ గరికపాటి, అన్నపూర్ణ కొర్ర, విజయ్ గుమ్మడి, వీరు వుప్పల, ఎంవీరావు, సతీష్ చిలుకూరి, తులసీ తుమ్మల, ఆది నారాయణ, చంద్ర గుంటుపల్లి, శ్రీనివాస్ వేముల, శాస్త్రి వెనిగళ్ల, రామ్ తోట, ప్రసాద్ మంగిన, రమేష్ కొండా, రవికిరణ్ ఆలేటి, జోగి నాయుడు, వెంకట్ అడుసుమల్లి, హరి సన్నిధి, వెంకట్ జెట్టి, వెంకట్ గొంప, కోటి బాబు కోటిన, భాస్కర్ అన్నే, శ్రీనివాస వల్లూరిపల్లి, హర్ష యడ్లపాటి, లక్ష్మణ్ పరుచూరి, కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి, మధు కందేపి, సాయి యనమదల, పాములు నారాయణ, వినయ్ యలమర్తి, భరణి యాతం, రమేష్ నాయుడు, సుభాష్ ఆర్, రవి ఆలపాటి, సురేష్ రెడ్డి ఉయ్యురు, భరత్ ముప్పిరాళ్ళ, చక్రధర్ అనుమోలు, నరహరి మర్నేని తదితరులు హాజరయ్యారు. తానా ఎన్నికల ప్రచారంలో భాగంగా బే ఏరియాలో ఉన్న నరేన్ కోడలి, రాజా సూరపనేని కూడా హాజరయ్యారు.