
Sr NTR fame: నందమూరి తారక రామారావు ఈ పేరు చిత్ర సీమ అగ్రస్థానంలో చిరస్థాయిగా నిలుస్తుంది. అందం, అభినయం, ఆహార్యం మెండుగా కలిగి ఉన్న ఆయన ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయేవారు. నందమూరి విలక్షణ నటుడు ఎన్నో వందలాది పాత్రల్లో ఆయన తెలుగు వారి మనో ఫలకంపై చెరగని ముద్ర వేశారు. హీరో గానే కాకుండా బృహన్నలా కూడా.. అంతటితో ఆగకుండా రావణాసురుడిలా.. ఇదేనా మరో పోలీస్ గా.. ప్రతీ పాత్రకు ఆయన వన్నె తెచ్చారు. ఎన్టీఆర్ వచ్చే సమయానికి అగ్రభాగాన ఉన్న నటుడు అక్కినేనిని సైతం ఆయన వెనక్కి నెట్టారంటే ఆయన విలక్షణత ఏపాటితో ఇట్టే అర్థం అవుతుంది.
నాటక రంగంపై తీవ్రమైన అభిమానం ఉన్న ఆయన చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి చెన్నపట్నం వచ్చి సినిమాల్లో అవకాశాల కోసం వెతికారు. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం సినిమాల్లో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. పోటీ తత్వాన్ని కూడా ప్రేమగా మలుచుకోవడంలో ధిట్ట ఆయన. నందమూరి సినిమాల్లోకి అడుగుపెట్టిన సమయంలో అక్కినేని నాగేశ్వర్ రావు అగ్ర హీరోగా వెలుగొందుతున్నాడు. ఏ మాత్రం జంకు బొంకు లేకుండా ఆయనతో కిలిసి తన రెండో చిత్రం ‘పల్లెటూరి పిల్ల’లో నటించారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్ నటనా ప్రస్తానం దేదీప్యంగా కొనసాగుతూనే ఉంది.
వందలాది సినిమాలు వేలాది పాత్రలు ప్రతీ పాత్ర ఒక విలక్షణమే. హీరోగా, విలన్ గా, పోలీస్, అవిటివాడుగా, తాతగా ఇలా చెప్పుకుంటూ పోతే పేజీలు కూడా చాలవేమో. అనతి కాలంలోనే దేశంలోనే గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. తనే నిర్మాణ బాధ్యతలు చేపట్టి తీసిన దానవీరశూర కర్ణలో 9 పాత్రల్లో నటించి వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. అల్లూరి సితారామరాజు సినిమా నేపథ్యంలో సూపర్ స్టార్ క్రిష్ణకు ఆయనకు మధ్య కొంత గ్యాప్ వచ్చిందని అప్పట్లో టాక్ వినిపించింది. ఆ సినిమాను ఎన్టీఆర్ చేద్దామని అనుకున్నారు. కానీ అప్పటికే సూపర్ స్టార్ క్రిష్ణ దానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశారు. సోదరుడికి ఇబ్బంది కలగవద్దు అంటూ ఈ ప్రాజెక్ట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారు. కృష్ణ మూవీ హిట్ అయిన తర్వాత ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారట ఎన్టీఆర్.
ఆయన ఓ మహోన్నత శిఖరం. మనస్సున్న హీరో, నిర్మాణంలోనూ విలువలు పాటించేవారు ఆయన. సినిమా కళామతల్లికి ఆయన చేసిన సేవలు బహూషా ఇప్పటికీ ఎవరూ చేయకపోయి ఉండరేమో.