
Sree Reddy : సినిమా, రాజకీయం రెండు ఒకటే. వాగ్దానాలు ఇస్తారు కానీ నెరవేర్చుకోరు. ఇక్కడ సక్సెస్ అయిన చాలా మంది అక్కడ కూడా విజయం సాధించారు. అందులో ఎన్టీఆర్, జయలలిత, ఎంజీఆర్ వంటి వారు ఉన్నారు. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే బ్యాక్ బోన్ ఉండాల్సిందే. అలా లేని వారు పట్టు సాధించిన దాఖలాలు లేవు. చిరంజీవి కూడా అల్లు రామలింగయ్య బిడ్డను చేసుకున్నాకే ఎదిగారు.
ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో శ్రీరెడ్డి గురించి అందరికి తెలుసు. ఆమె అందరిని తిట్టింది. ప్రతి ఒక్కరిని నిందించింది. తన దుస్థితికి కారకులైన వారిపై దుమ్మెత్తిపోసింది. ఆ సమయంలో శ్రీరెడ్డికి దర్శకుడు తేజ అండగా నిలిచాడు. తన సినిమాలో ఆమెకు అవకాశం ఇస్తానని మాట కూడా ఇచ్చాడు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన సినిమా అహింసలో చోటు దక్కలేదు.
ఎందుకంటే కారణం అందరికి తెలుసు. రానా కుటుంబానికి ఆమెకు మధ్యనే గొడవ జరిగింది. ఈ క్రమంలో తేజ తన తరువాత సినిమా కూడా రానాతో ఉంటుండటంతో అందులో కూడా చాన్స్ లేనట్లే. దీంతో దర్శకుడు తేజను ఈ విషయంపై ప్రశ్నించగా అదే మాట మీద ఉన్నానని చెబుతున్నాడు. కానీ ఆమెకు మాత్రం అవకాశం ఇవ్వడానికి సమయం దొరకడం లేదు.
దీంతో శ్రీరెడ్డి కోరిక తీరుతుందా? ఆమె సినిమాల్లోకి రావాలనే కల నెరవేరుతుందా? అనే సందేహాలు ఆమెలో వస్తున్నాయి. తేజ సినిమాలో అవకాశం కోసం చూస్తున్నా వీలు కావడం లేదు. ఇంకా ఎవరైనా చాన్స్ ఇస్తారేమో అనుకుంటే కుదరడం లేదు. తేజ ఎప్పుడు అవకాశం ఇస్తాడో ఆమె ఎప్పుడు సినీ రంగ ప్రవేశం చేస్తుందో చెప్పలేం.






