BS Rao : శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌లు భారతదేశంలో ఉన్న అతిపెద్ద విద్యా ఔట్‌లెట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది మన అందరికీ తెలుసు. ఈ సంస్థల వెనుక ఉన్న వ్యక్తి బొప్పన సత్యనారాయణరావు కొద్దిసేపటి క్రితం మరణించారు. బీఎస్ రావు (75) గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం పరిస్థితి విషమించి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
– బీఎస్ రావు నేపథ్యం
మీడియా కథనాల మేరకు ఆయన భౌతికకాయాన్ని విజయవాడకు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బీఎస్ రావు , అతని భార్య 1986లో శ్రీ చైతన్య సంస్థలను స్థాపించడానికి ముందు ఇంగ్లండ్ , ఇరాన్‌లలో వైద్యులుగా సేవలందించారు.
ఈ సంస్థ మొదట బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలుగా ప్రారంభించబడింది, అయితే అది తరువాత శాఖలుగా విస్తరించి గొప్ప స్థాయికి చేరుకుంది. నేటికి భారతదేశం అంతటా శ్రీ చైతన్యకు 321 జూనియర్ కళాశాలలు, 322 టెక్నో పాఠశాలలు , 107 CBSE పాఠశాలలు ఉన్నాయి. అక్కడ 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఎంసెట్, ఇంజినీరింగ్, మెడికల్, ఐఐటీ కోచింగ్ లో దేశంలోనే టాప్ సంస్థగా ఉంది. ఈ విద్యాసంస్థల్లో చదివిన వారే ఇప్పుడు దేశాన్ని ఏలుతున్నాయి.