Sri Krishna Janmashtami : ప్రతీ ఏటా భాద్రపదమాసం, కృష్ణ పక్షం, ఎనిమిదో తిథి నాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు జన్మించిన సందర్భంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి నిర్వహించుకుంటాం. ఈ ఏడాది ఆగస్ట్ 26 (సోమవారం) పండుగ వచ్చింది. ఈ రోజు శ్రీ కృష్ణుడికి కొలుస్తూ ఉపవాసం ఉండడం వల్ల కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. జన్మాష్టమిన ఈ పరిహారం చేయడం వల్ల శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. ఈ రోజు ఉపవాసంతో రాజయోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుడిని బాల స్వరూపంలో ఈ రోజు పూజిస్తారు. ఈ ఏడాది అరుదైన శుభ యోగం కలుగుతుందట. దీంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం వరిస్తుందట. 30 ఏళ్ల తర్వాత ఇలాంటి రోజు వచ్చిందని శాస్త్రాలు చెప్తున్నాయి.
ఈ సంవత్సరం (2024) ఆగస్ట్ 26న అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చంద్రుడు వృషభ రాశిలో ఉంటాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో కూడా చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడట. సర్వార్థ సిద్ధి యోగం ఒక నక్షత్రం వారంలో ఒక నిర్ధిష్ట రోజు ఏర్పడే ఒక ప్రత్యేకమైన యోగం. ఈ రాశి గుర్తు కలయిక కొత్త ఉద్యోగం లేదంటే వ్యాపారాన్ని ప్రారంభించేందుకు శుభప్రదంగా ఉంటుంది.
శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున గురుచంద్ర మిలన్ గజకేశరి యోగం కలుగుతుంది. ఈ అరుదైన కలయిక 12 రాశీ చక్రాలను ప్రభావితం చేస్తాయి. ఈ కాలం కొన్ని రాశులకు ప్రత్యేకమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కాలం కొన్ని రాశులకు అదృష్టమని రుజువైంది.
మేషరాశి..
ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి ఈ రాశి వారికి ప్రత్యేకమైంది. పెండింగ్‌లో పనులు నెరవేరుతాయి. నిరుద్యోగి తనకు నచ్చిన ఉద్యోగంకు సంబంధించి శుభవార్తలు వింటాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులు అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు పొందవచ్చు.
వృషభం..
రాశి వారికి శ్రీ కృష్ణ జన్మాష్టమి నుంచి మంచి జరగనుంది. మీ సహోద్యోగులతో కలిసిపోతారు. అందరి మనస్సును గెలుచుకోవడంలో సక్సెస్ అవుతారు. వివాహాది సమస్యలతో బాధపడేవారు శుభవార్త వింటారు.
సింహం..
ఈ రాశి వారు సమాజంలో గౌరవం పొందుతారు. కొత్తగా ఏదైనా పని చేపట్టేందుకు ఇదే సరైన సమయం. ఈ రాశి వారికి జన్మాష్టమి పవిత్రమైంది. కొత్తగా ఏదైనా పని చేయాలనుకుంటే ఈ రోజు చేస్తే దిగ్విజయం కలుగుతుంది.
కుంభం..
కుంభ రాశి వారిపై శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటాయి. ఆనందం, ఐశ్వర్యంతో పాటు ఆయువు, ఆరోగ్యం పొందుతారు. వ్యాపారం, వృత్తికి సంబంధించి ఈ రోజు ప్రత్యేకమైంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.