
Hasaranga New Record : శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులోనే వనిందు హసరంగ అరుదైన రికార్డు సాధించాడు. ఐదు వన్డేల్లో 22 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ గా చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 33 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును సాధించాడు. కాగా ఆఖరి మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన హసరంగ 79 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. దీంతో పాటు వరుసగా మూడు మ్యాచ్ లలో ఐదు వికెట్లు తీసిన మొట్టమొదటి స్పిన్నర్ గా హసరంగ రికార్డు సృష్టించాడు.
వరుస విజయాలతో క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో శ్రీలంక జట్టు సూపర్ సిక్స్ కు వెళ్ళింది. ఐర్లాండ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో 33 పరుగులతో శ్రీలంక ఘనవిజయం సాధించింది. దీంతో క్వాలిఫైయర్ రేస్ నుంచి ఐర్లాండ్ జట్టు విశ్రమించింది ఐదు వికెట్లు తీసి ఐర్లాండ్ ను శ్రీలంక బౌలర్ హసరంగ కట్టడి చేశాడు. వరుసగా మూడోసారి ఐదు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అయితే వన్డేలలో రెండో బౌలర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన శ్రీలంక కెప్టెన్ కరుణ రత్నే కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఐర్లాండ్ ముందు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆట మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ 31 ఓవర్ల లో 192 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో గ్రూప్ బి నుంచి శ్రీలంకతో పాటు స్కాట్లాండ్ , ఒమన్ సూపర్ సిక్స్ కు చేరుకున్నాయి గ్రూప్ ఏ నుంచి వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్ ఉన్నాయి.