Home EXCLUSIVE Sri Ram Parivar Pooja : వైభవంగా సీతా రాముడి పట్టాభిషేకం.. సాయి దత్త పీఠంలో...

Sri Ram Parivar Pooja : వైభవంగా సీతా రాముడి పట్టాభిషేకం.. సాయి దత్త పీఠంలో కన్నుల పండువగా వేడుకలు

128
Sri Ram Parivar Pooja
Sri Ram Parivar Pooja

Sri Ram Parivar Pooja : జగదభిరాముడు, లోక పావని జానకీ మాత కల్యాణం బుధవారం కన్నుల పండువగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య రామచంద్రుడు సీతమ్మ మెడలో తాళి కట్టి సీతారాముడయ్యారు. ఈ అద్భుతమైన ఘట్టంను యావత్ ప్రపంచం ఆనందంగా తిలకించగా.. భారత్ లో మాత్రం వీధి వీధినా వాడ వాడనా రాములోరి కల్యాణం జరిపించి మరీ భక్తులు పొంగి పోయారు.

అమెరికా, న్యూ జెర్సీలోని శ్రీ సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో కొనసాగే శ్రీ శివ విష్ణు దేవాలయంలో కూడా శాస్త్రోక్తంగా, మేళ తాళాల మధ్య రాములవారి కల్యాణం వైభవంగా జరిగింది. శ్రీరామ చంద్రుడు సీతమ్మను కొలిచేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరాగా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాముల వారి కల్యాణంతో పాటు వసంత నవరాత్రి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు కొనసాగాయి.

రాములోరి కల్యాణం రోజున (ఏప్రిల్ 17) ఉదయం సాయి బాబాకు అఖండ హారతితో మొదలైన కార్యక్రమలు రాత్రి వరకు కొనసాగాయి. శ్రీ రామ్ పరివార్ పూజ, శ్రీరామ పట్టాభిషేకం, ధోల్ మరియు డ్రమ్స్‌తో రామ్ పరివార్ & శ్రీమాత పల్కి ఉత్సవం, తర్వాత చందనోత్సవంను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల ముగింపుతో వసంత నవరాత్రి తో పాటు శ్రీ సీతా రామ కల్యాణ మహోత్సవం ఉత్సవాలు ముగిసాయి.

All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

More Images : Sri Ram Parivar Pooja, Sri Ram Pattabhishekam