Sri Reddy VS Chiranjeevi : మెగా స్టార్ గా చిరంజీవికి ఎంతమంచి ఇమేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన ఏ పని చేసినా చాలా హుందాగానే ఉంటుంది. ఒక్కోసారి తన మీద విమర్శలు చేసే వారిని కూడా ఆయన గౌరవిస్తూ ఉంటారు. అదే ఆయన సంస్కారం. అందుకే ఆయన్ను అంతమంది ఇష్టపడుతారని చెప్పుకోవాలి. ఇక ఆయన తాజాగా నటిస్తున్న భోళాశంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మొన్న ఆదివారం నిర్వహించారు.
కాగా ఈ ఈవెంట్ లో చిరంజీవి కీర్తి సురేష్ పై చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కీర్తి సురేష్ లాంటి అందమైన అమ్మాయి అన్నయ్యా అని పిలిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. గుండెల్లో తలుక్కుమని అనిపిస్తుంది. ఆమెకు నేను ముందే చెప్పాను. ఈ సినిమా వరకే ఆమె నాకు చెల్లెలు పాత్రలో చేస్తుంది. ఆ తర్వాత మాత్రం కాదు.
ముందు ముందు ఆమె నా పక్కన హీరోయిన్ గా చేయాలని కోరుకుంటున్నా అంటూ కాస్త చిలిపిగా మాట్లాడారు చిరంజీవి. ఆయన చేసిన కామెంట్లు ఆ ఈవెంట్ కు హైలెట్ అయ్యాయి. కానీ ఇవే మాటలు శ్రీరెడ్డికి మాత్రం మంటెక్కేలా చేశాయి. ఇంకేముంది ఆ కాంట్రవర్సీ బ్యూటీ రెచ్చిపోయింది. ఏకంగా చిరంజీవిపైనే కాంట్రవర్సీ పోస్టు పెట్టింది.
కూతురు వయసున్న నటితో మీ కామవేశాలేంటి చిరంజీవి గారు. మీ వయసును కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు. గద్దర్ చనిపోయినందుకు కనీసం మౌనం పాటించి ఉంటే మీ గౌరవం దక్కేది. కానీ ఇలాంటి పనులు చేయడం మీ స్థాయికి తగవు అంటూ కామెంట్లు చేసింది. కాగా ఆమె పోస్టుపై మెగా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. చిరంజీవి సరదాగా అలా అన్నారు. అదే స్టేజిపై కీర్తి సురేష్ నా బిడ్డలాంటిది అని కూడా చెప్పారు. అది నీకు కనపడలేదా ఛీ రెడ్డి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.