పంటలను పెంచు,అడవిని ప్రేమించు అన్న హితం భోదిస్తూ 6 ఏళ్ళకే పశువుల కాపరిగా,9 ఏళ్ళకే బంజార బతుకుల అధ్యయన శీలి గా సేవాలాల్ పనిచేశారు. 15 ఏళ్ళకే అత్యంత ప్రభావశీలి “సేవా భియా” గా మారి మదమెక్కిన బ్రిటీషు మూకచే క్రిమినల్ ట్రైబ్ గా చిత్రీకరించి తన జాతిని ఆత్మ గౌరవ దిశగా చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి సేవాలాల్ అని చెప్పవచ్చు. నేడు ఆయన జయంతి.
ఆంగ్లేయుల ఆజాయిషీ లో రవాణా సాధనా చోదకులుగా ఉన్న బంజారా సోదరుల ను నాటి తెల్ల శునకాల పైకి పోరాట స్పూర్తితో ఆయన ముందుకు సాగారు. నాయక్, కారొబారి,డావో, నసాబీ గా వర్గీకరించి ,గౌరవ ప్రదమైన పనులు అప్పగించి తమకంటూ గౌరవప్రదమైన కూడూ, గూడూ,గుడ్డ కావాలని తండాల నిర్మాణానికి ప్రో త్సహించిన దిక్సూచి సేవా లాల్. బంజారాలకే కాదు. ఆత్మాభిమానం ఉన్న ప్రతీ బడుగు జీవికీ ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్..