Sridevi Death Mystery : అతిలోక సుందరి శ్రీదేవి అంటే తెలియని వారు లేరు.. ఈమె పేరు చెబితే చాలు పరిచయం అవసరం లేకుండానే గుర్తు పడతారు.. శ్రీదేవి సౌత్ టు నార్త్ ఒక ఊపు ఊపేసింది.. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో ఈమె స్టెప్పులు వేసి ఆడిపాడింది.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈమె తనకంటూ ఒక పేజీని ముద్రించుకుంది.. ఈ రోజు ఆగస్టు 13న ఆమె పుట్టిన రోజు కావడంతో ఆమెను అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
అంతటి గొప్ప హీరోయిన్ బాధాకరమైన పరిస్థితిలో మరణించడం అందరిని కలిచి వేసింది.. ఈమె జీవితంలో ఒక్క కెరీర్ మాత్రమే సాఫీగా సాగింది.. మిగిలిన విషయాల్లో ఎన్నో దాచలేని నిజాలు మరెన్నో దాగుడు మూతలు ఉన్నాయి.. మరి వాటినన్నంటిని ఒక పుస్తక రూపంలోకి మార్చడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది.
శ్రీదేవి బయోగ్రఫిని ప్రముఖ రచయిత, పరిశోధకుడు, బోణీ కపూర్ ఫ్రెండ్ ధీరజ్ కుమార్ రాస్తున్నారు.. మరి ఈ బయోగ్రఫీని ”ది లైఫ్ ఆఫ్ ఏ లెజెండ్” అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు.. మరి ఇందులో శ్రీదేవికి సంబంధించిన అన్నిటిని రాస్తారా? లేదంటే కొన్ని మిస్టరీలను వదిలేస్తారా? బయోగ్రఫీ లో శ్రీదేవి మరణం వెనుక మిస్టరీ కూడా ఉంటుందా? అని శ్రీదేవి అభిమానులకు ప్రశ్నలు వస్తున్నాయి..
శ్రీదేవి 2018 ఫిబ్రవరి 20న ఇండియాకు రావాల్సి ఉండగా ఫిబ్రవరి 24 వరకు అక్కడే ఎందుకు ఉంది.. దుబాయ్ లో అన్ని రోజులు ఏం చేసింది? మిగిలిన అందరు ఎక్కడ వారు అక్కడికి వెళ్లగా ఆమె మాత్రమే దుబాయ్ లో ఎందుకు ఉంది? బోణీ కపూర్ కూడా ఇండియా వచ్చాడు.. కానీ శ్రీదేవి ఒక్కతే ఆ హోటల్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది?
పైగా పోలీసులు మద్యం సేవించింది అని చెప్పారు.. ఫోరెన్సిక్ నిపుణులు గుండెపోటుతో మరణించింది అని చెప్పారు.. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో మిస్టరీ ఉందని ఆమె అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి ఆ డెత్ మిస్టరీ ఎలా బయటకు వస్తుంది.. ఈమె మరణం చుట్టూ బోలెడు అనుమానాలు ఉన్నాయి.. అవి ఈ బయోగ్రఫీ ద్వారా బయటకు వస్తాయా రావా చూడాలి..