Srikalahasti Constituency Review :
వైసీపీ : బియ్యపు మధుసూదన్ రెడ్డి
టీడీపీ : బొజ్జల సుధీర్ రెడ్డి
జనసేన : కోట వినూత
ఏపీ రాజకీయాల్లో శ్రీకాళహస్తీ నియోజకవర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా శ్రీకాళహస్తీ రసవత్తర రాజకీయాలకు కూడా కేంద్రంగా నిలుస్తున్నది. గతంలో టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం గత ఎన్నికల్లో వైసీపీ ఖాతాలో పడింది. అయితే ఈసారి రెండు పార్టీల మధ్య మాత్రం పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తున్నది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుమారు 2. 40 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ బీసీల ఓటు బ్యాంక్ అధికంగా ఉంది. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పడగా, మొత్తంగా ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి.
ఇక ఇక్కడ మొదటి నుంచి రెడ్డిలదే హవా కొనసాగుతున్నది. అయితే పల్లె రెడ్లుగా పిలిచే క్షత్రియ సామాజికవర్గం కూడా ఇక్కడ బలంగా ఉంది. ఆక గెలుపును నిర్దేశించేది మాత్రం బలిజ సామాజికవర్గమనే అ భిప్రాయం ఇక్కడ ఉంది. ఇక మొదటి నుంచి రెడ్డి సామాజికవర్గ నాయకులే ఇక్కడు గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. అయితే సంక్షేమ పథకాలే తనను మరో సారి గెలిపిస్తాయని, నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని బియ్యపు చెప్పుకుంటున్నారు. కానీ బియ్యపు అవినీతి, కబ్జాలకు తెరదీశాడని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జిగా, ఒకరకంగా అభ్యర్థిగా ఇప్పటికే బొజ్జల సుధీర్ రెడ్డి పేరును ఇప్పటికే అధినేత జగన్ ప్రకటించారు. తన స్నేహితుడు, రాజకీయాల్లో సమకాలీనుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబానికి అండగా నిలవడంలో భాగంగా చంద్రబాబు సుధీర్ రెడ్డిపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. ఇక జనసేన అభ్యర్థిగా కోటా వినూత కూడా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ, జనసేన పొత్తుతో వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో సీటు ఎవరికి వస్తుందనే అంశంపై ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో ఇప్పటికైతే ప్రధాన పోరు టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందనేది టాక్. ఇక టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగితే గెలుపు సునాయసమేనని చెబుతున్నారు.
బొజ్జల కుటుంబానికి ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి గోపాలకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. ఆయన ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. గత ఎన్నికల్లో సుధీర్ రెడ్డి పోటీ చేసినా విజయం వరించలేదు. ఈసారి ఎలాగైనా గెలవాలని ఆయన ప్రజల్లోనే ఉంటున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో టీడీపీ ఓడిపోయింది. కానీ 2024లో మళ్లీ సత్తా చాటాలని ఆ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది.