29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Pedakapu : శ్రీకాంత్ అడ్డాల న్యూ మూవీ టైటిల్ ‘పెదకాపు’.. ఎన్ని విమర్శలు ఎదుర్కుంటుందో..?

    Date:

    Pedakapu
    Pedakapu, Srikanth addala

    Pedakapu : ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలకు మంచి గుర్తింపు ఉంది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆయన కెరీర్ కు భారీ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. మహేశ్ బాబు లాంటి స్టార్ సైతం డేట్స్ ఇచ్చే రేంజ్ కి వెళ్లాడు దర్శకుడు. అయితే మహేశ్ బాబుతో కలిసి తన రెండో చిత్రం ‘బ్రహ్మోత్సవం’ చేశాడు. ఇది భారీ డిజాస్టర్ తెచ్చిపెట్టింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను శ్రీకాంత్ అంత బాగా పండించలేకపోయాడు. ఈ సినిమాను సీరియల్ అంటూ కూడా చాలా వివాదాలు నడిచాయి. ఇంత పెద్ద కాస్ట్ తో ఇలాంటి సినిమానా అంటూ ఇండస్ట్రీ మొత్తం శ్రీకాంత్ పై ఫైర్ అయ్యింది.

    బ్రహ్మోత్సవం తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ చాలా కాలం గ్యాప్ తీసుకున్నాడు. నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు అసురన్ రిమేక్ తీయాలని అందుకు తగ్గ డైరెక్టర్ కోసం అన్వేషించాడు. ఈ నేపథ్యంలో ఆయనకు శ్రీకాంత్ అడ్డాల కనిపించాడు. దీంతో వీరి కాంబోలో ‘నారప్ప’ రూపుదిద్దుకుంది. అప్పుడు కరోనా లాక్ డౌన్ నడుస్తుండడంతో ఓటీటీలోకి రిలీజ్ చేశారు. ఒక మాదిరిగా ఆడిన మూవీ తర్వాత థియేటికల్ రిలీజ్ చేయగా ఏ మాత్రం ఆడలేదు.

    నారప్ప తర్వాత వచ్చిన గ్యాప్ లో టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా హీరోలుగా మారారు. ఒక్కొక్కరూ రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీంతో శ్రీకాంత్ సెకండ్ హీరోల వైపు చూశాడు. ‘అఖండ’ ప్రొడ్యూసర్స్ ద్వారక క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ లుక్ కూడా ఇటీవల విడుదల చేశారు. మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు హీరోగా ఈ సనిమాతో పరిచయం అవుతున్నాడట. అయితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం టైటిల్ ‘పెదకాపు అంట. క్యాస్ట్, పాలిటిక్స్, సామాజిక సమస్యల ఆధారంగా ఈ మూవీ ఉంటుందని టాక్ వినిపస్తోంది.

    ‘పెదకాపు’ ద్వారా డైరెక్టర్ అనేక వివాదాస్పద అంశాలను స్పృషిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. యాక్షన్, వైలెన్స్ కలిగిన సోషల్ సబ్జెక్టు పెదకాపు అంటున్నారు. టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించకున్నా ఇదే ఉండబోవచ్చనే లీక్ ఉంది. జూన్ 2న ఈ సినిమా గురించి రివీల్ చేస్తామని చెప్పారు. అప్పుడే ఈ మూవీ టాలీవుడ్ హాట్ టాపిక్ అవుతుంది. శ్రీకాంత్ అడ్డాల వంటి డైరెక్టర్ ఎలాంటి మూవీ చేస్తారో చూడాలి మరి. ఇక అఖండ మూవీతో మిర్యాల రవీందర్ రెడ్డి భారీ విజయం సొంతం చేసుకున్నారు. కోట్లు కొల్లగొట్టారు. ఈ మూవీకి ఎక్కువగానే ఖర్చు పెడతారని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related