
Srikanth Bolla : మోచేతిలో బలముంటే మొండి కొడవలి అయినా తెగుతుందంటారు. చీకటిని చూసి తిట్టుకునే కంటే ఆ చీకటిలోనే చిరు దీపం వెలిగించడం మంచిది అనేది చైనా సామెత. మనసుంటే మార్గముంటుంది. ఎవరు పుట్టుకతోనే డబ్బుతోని పుట్టరు. మనం చేసే పనులే మనల్ని ధనవంతుల్ని చేస్తాయి. లేదా పేదరికంలో తోస్తాయి. మన ఆలోచనలను బట్టే మన ఎదుగుదల ఉంటుంది.
కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్నారో సినీకవి. మనం చేసే పనులే మనకు అలాంటి స్థాయి తెచ్చిపెడతాయి. కృష్ణ జిల్లా సీతారామపురంలో 1992 జులై 7న శ్రీకాంత్ జన్మించాడు. పుట్టుకతోనే గుడ్డివాడు కావడంతో ఊరంతా అతడిని వదిలించుకోవాలని సలహా ఇచ్చారు. కానీ వారు మాత్రం తమ బిడ్డను వదిలేసుకోమని చెప్పారు. తాము బతికున్నంత కాలం చూసుకుంటాం. తరువాత దేవుడే చూసుకుంటాడని చెప్పారు.
ఇక చదువు విషయంలో శ్రీకాంత్ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాడు. ఒక దశలో చదువు మానేసి ఇంట్లోనే ఉండిపోయాడు. కానీ కాలం అతడిలో మళ్లీ చదువుకోవాలనే కాంక్ష పెంచింది. దీంతో అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదివాడు. అతడి ప్రతిభను చూసిన అక్కడి వారు తమ కంపెనీల్లో పనిచేయాలని సూచించినా ఇండియాకు వచ్చి దివ్యాంగులను చేరదీసి వారికి మార్గం చూపుతున్నాడు. వారిని చదివిస్తున్నాడు.
ప్రస్తుతం రూ.150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. వీరి కంపెనీలో 300 మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు. 3 వేల మంది విద్యార్థులను చదివిస్తున్నారు. ఇలా శ్రీకాంత్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అపజయాలను దిగమింగి విజయాలు సొంతం చేసుకున్నాడు. అవమానాలను దాటుకుని ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు.