22.2 C
India
Saturday, February 8, 2025
More

    #Srikanth_Bolla : చీకటిని చీల్చుకొని 150 కోట్ల కంపెనీని తీర్చిదిద్దిన ఒక అంధుడి స్ఫూర్తి కథ

    Date:

    #Srikanth_Bolla : కృష్ణా జిల్లా లోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబం లో 1992 జూలై 7 వ తేదీన శ్రీకాంత్ బొల్ల పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ వూరి జనం అయితే మరో అడుగు ముందుకేసి , ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. కానీ అమ్మ నాన్న అలా చేయలేదు. ” మేము బతికున్నంతవరకు వీడిని బాగా చూసుకొంటాం. మేము పోయాక దేవుడే చూసుకోవాలి ” అని అనేవారు.

    కళ్ళుకనపడకపోవడం తప్ప , బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా వుండేవాడు. కానీ ఇంటర్ లో ‘ నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని ” కాలేజీలు చెపితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి అడ్మిషన్ తెచ్చుకొన్నాడు. తోటి పిల్లల ఎగతాళి భరించలేక చదువు మానేసి 2 ఏళ్ళు ఇంట్లోనే వుండిపోయాడు. మళ్ళీ హైదరాబాద్ లో school for the specially abled లో చేరాడు. అక్కడ కూడా పిల్లలు అవమానపెట్టారు. అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడి వదిలేసి  పారిపోతుంటే ఒక టీచర్ పట్టుకొని చెంపచెళ్ళుమనిపించింది. అది అతని జీవితం లో గేమ్ చేంజింగ్ మూమెంట్..  ఆ టీచర్ ఆడియో టేపుల్లో పాఠాలు వినిపించింది. ఇంటర్ లో MPC చదివి 98% సంపాదించగా ఎగతాళి చేసినవారు అవాక్కయ్యారు. కానీ IIT వాళ్ళు సీటు ఇవ్వమన్నారు. నిరాశ పడని అతను అమెరికా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వ్రాస్తే Stanford , మరో 2 universities admission ఇవ్వడానికి ముందుకొచ్చాయి. శ్రీకాంత్ Howard Massachusetts Institute of Technology [అమెరికా] లో చేరాడు. అక్కడ Brain Cognitive Sciences లో చేరిన తొలి అంధుడిగా రికార్డు పొందాడు. అతని ప్రతిభ చూసి , చదువు అయ్యాక 4 అమెరికన్ కంపెనీ లు తమ దగ్గర వుద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా ‘ లేదు ‘ అని చెప్పాడు. ‘ భారతదేశం చేరుకొని తనతోటి నిరుపేద , దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు ‘ అని అతను భగవంతుడిని ప్రతి రాత్రీ ప్రార్థించేవాడు. ప్రార్థనలు పరమాత్మ విన్నాడు.

    శ్రీకాంత్ ఇండియాకు వచ్చి హైదరాబాద్ దగ్గర Bollant Industries స్థాపించాలని వుందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు. అది మొదలైంది. ఈరోజు అది 150 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ. దానికి శ్రీకాంత్ సీఈవో..  సాక్షాత్తూ అబ్దుల్ కలాం గారే అక్కడికొచ్చారు. ఇద్దరూ కలిసి Lead India Project ద్వారా 4 లక్షలమంది విద్యార్థులకు పాఠాలు చెప్పారు. శ్రీకాంత్ దగ్గర ఇపుడు సుమారు 300 మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు. అతను 3000 మంది విద్యార్థులను చదివిస్తున్నాడు.

    #చీకటి ని అసహ్యించుకోనేవారు కొందరు , చీకటి ని చూసి భయపడేవారు ఇంకొందరు , చీకటిని చీల్చుకువెళ్ళేవారు మరికొందరు.ఆ మూడవరకం వాళ్ళను మూడక్షరాల పదం లో ” సూర్యుళ్ళు ” అంటారు. మనవాడు మరో సూర్యుడు,మరియు ఎందరికో మార్గదర్శి,ఇటువంటి వారి చరిత్రలు ఎందరికో దశ,దిశ నిర్దేశితాలు…

    Share post:

    More like this
    Related

    Actor Sonu Sood : తన అరెస్ట్ వారెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన నటుడు సోనూసూద్

    Actor Sonu Sood : నటుడు సోనూ సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ...

    Nagarjuna : బీజేపీ లోకి నాగార్జున..? కుటుంబంతో కలిసి మోడీ దగ్గరకు..

    Nagarjuna : టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇటీవల తన కుటుంబంతో...

    interest rates : లోన్లు తీసుకున్న వారికి గుడ్‌న్యూస్.. వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ

    interest rates : ఆర్బీఐ శుభవార్త తెలిపింది. కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ...

    EV Buses : హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు: టికెట్ ధర రూ. 99 మాత్రమే!

    EV buses: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణించే వారికో శుభవార్త! ఈ రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Srikanth Bolla : దివ్యాంగులకు దిక్సూచిలా మారిన శ్రీకాంత్

    Srikanth Bolla : మోచేతిలో బలముంటే మొండి కొడవలి అయినా తెగుతుందంటారు....