Srileela :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2తో వరల్డ్ స్టార్ గా ఎదగనున్నాడు. సుకుమార్ పుష్ప 2 కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పుష్పను మించి ఉండాలని చూస్తున్నాడు. పుష్పలో ఊ అంటావా మావా అంటూ సందడి చేసిన సమంత పాటకు భలే క్రేజీ వచ్చింది. ఇక పుష్ప2 లో కూడా అలాంటి పాటే ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఐటమ్ సాంగ్ లో నటించేందుకు ఎవరిని తీసుకోవాలనే దానిపై చిత్రం యూనిట్ ఆరా తీస్తోంది. మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని శ్రీలీలను ఎంపిక చేశారు. ఆమెను అప్రోచ్ అయితే ఆమె నో చెప్పిందట. హీరోయిన్ గా బిజీగా ఉండటంతో ఐటమ్ సాంగ్ చేయలేనని చెప్పడంతో ఆ పాత్ర ఎవరితో చేయించాలని చిత్రం యూనిట్ తల పట్టుకుందట.
బన్నీతో నటించడానికి అందరు ఎగబడుతుంటే శ్రీలీల మాత్రం ఆ అవకాశాన్ని త్రుణప్రాయంగా భావించడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. మెగా కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్ తరువాత తనదైన శైలిలో ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. తనదైన శైలిలో రాణిస్తూ ఎన్నో సినిమాల్లో నటించి అవి విజయవంతం అయ్యేందుకు తనవంతు పాత్ర పోషిస్తున్నాడు.
త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తీసే సినిమాలో కూడా శ్రీలీలను అడుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీలీల మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఎదగడంతోనే ఐటమ్ సాంగ్ చేయడానికి నో చెప్పినట్లు సమాచారం. ఏది ఏమైనా అల్లు అర్జున్ తో పుష్ప2లో ఐటమ్ సాంగ్ లో నటించే అవకాశం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే మరి.