Srinidhi Shetty :
ఇండస్ట్రీలో హిట్ దక్కాలంటే ప్రతిభతో పాటు పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఇందులో ఏది లేకపోయినా కష్టమే. ఇలా పరిస్థితులు కుదరక ఎంతో మంది హీరోయిన్లు ఫేడ్ అయ్యారు. శ్రీనిధి శెట్టి మాత్రం తీసిన ఫస్ట్ మూవీతోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు.
పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2తో శ్రీనిధి శెట్టి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాలో హీరో యష్ తోపాటు ఈమెకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత యష్ అదే ఊపు కంటిన్యూ చేస్తున్నా.. శ్రీనిధి శెట్టి మాత్రం వెనకే ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎటువంటి ప్రాజెక్టులు లేవు. శ్రీనిధి శెట్టి ఫ్యాన్స్ కు ఇది ఒక రకంగా ఇబ్బంది అనే చెప్పవచ్చు.
రీసెంట్ గా శ్రీనిధి పాపిటలో బొట్టు పెట్టుకొని ఉన్న ఫొటోలు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యింది. వీటిపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ పెడుతున్నారు. కొందరు ఈ పిక్ ను చూసి శ్రీనిధి శెట్టి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకుందని చెప్తున్నారు.
ఆమె కుటుంబం, ఆమె గురించి తెలిసిన వారు మాత్రం ఆమె పెళ్లి చేసుకుంది అన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని చెప్తున్నారు. ఆమె పెళ్లి అనే వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కర్ణాటకలోని ఒక వర్గానికి చెందిన వారు యుక్త వయస్సు వచ్చిన తర్వాత పాపిటలో బొట్టు పెట్టుకునే సంప్రదాయం కొనసాగిస్తారు. ఈ వర్గానికే చెందింది శ్రీనిధి శెట్టి. ఇది ఆచారంలో భాగమే అని చెప్తున్నారు. అందుకే శ్రీనిధి శెట్టి అలా పాపిటలో బొట్టు పెట్టుకుంది. కానీ ఆమె పెళ్లి చేసుకోలేదు అంటూ వివరణ ఇస్తున్నారు. ఏది ఏమైనా శ్రీనిధి పిక్ వల్ల ఫ్యాన్స్ తీవ్రంగా గందరగోళానికి గురయ్యారు.