
Ublood : ప్రతిభను ప్రోత్సహిస్తూ, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ విశేష సేవలందిస్తున్న శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ (SRF) వార్షికోత్సవం ఈనెల 15వ తారీకున కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ధనసరి అనసూయ (సీతక్క) విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆత్మీయ సన్మానం నిర్వహించనున్నారు.
SRF గత 22 సంవత్సరాలుగా విభిన్న రంగాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతిభగల వారిని గుర్తించి అవార్డులను అందచేస్తూ వస్తోంది. ఈ సారి కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిభా పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు అవార్డుల ప్రధానోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
– యూబ్లడ్ యాప్ పోస్టర్స్ ఆవిష్కరణ
ఈ కార్యక్రమంలో యూబ్లడ్ యాప్ పోస్టర్స్ ను మంత్రి సీతక్క గారు ఆవిష్కరించనున్నారు. జర్నలిస్ట్ చిలువేరు శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. యూబ్లడ్ యాప్ రక్తదాతలను, రక్త అవసరమైన రోగులను అనుసంధానించే గొప్ప వేదికగా నిలవనుంది.
కరోనా సమయంలో పేద ప్రజలకు అండగా నిలిచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన సీతక్క గారు జనహృదయ నేతగా ప్రశంసలు అందుకున్నారు. పేదలకు భరోసా కల్పిస్తూ, వారికి సహాయసహకారాలు అందిస్తూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం.. యూబ్లడ్ కు మరింత ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఆసక్తిగల ప్రతి ఒక్కరు హాజరై వేడుకలను గ్రాండ్‌గా చేయాలని SRF ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు.
– కార్యక్రమం వివరాలు ఇవీ..
– తేదీ: ఫిబ్రవరి 15
– ప్రదేశం: కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం, హనుమకొండ
– ముఖ్య అతిథి: గౌరవ శ్రీ ధనసరి అనసూయ (సీతక్క)
– యూబ్లడ్ యాప్ పోస్టర్స్ ఆవిష్కరణ
– విద్యార్థులకు ప్రతిభా పోటీల విజేతలకు అవార్డుల ప్రధానోత్సవం
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరి సహకారం కోరుకుంటూ, ఆసక్తి కలిగిన వారందరికీ అహ్వానిస్తున్నారు.