Rajamouli :
ప్రాజెక్ట్-కే అంటే ఏమిటి అనేది ఒక సంగ్రహావలోకనం ద్వారా ఆవిష్కరించబడింది. ఈ చిత్రానికి ‘కల్కి 2898 AD’ అని మూవీ టైటిల్ పెట్టారు. చీకటి శక్తుల బారి నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు వచ్చే సూపర్ హీరోగా ప్రభాస్ ఇందులో కనిపించనున్నాడు. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ గ్లింప్స్ సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ, చిత్రం బ్యాగ్రౌండ్, మ్యూజిక్, ఇలా అన్నింట్లో ఈ సినిమా మారో విప్లవం తెస్తుందని గ్లింప్స్ చూసిన ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గ్లింప్స్ లో ప్రభాస్ ను చూసిన ఫ్యా్న్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీనిపై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ‘నాగి&వైజయంతీ మూవీస్. ఫ్యూచర్ సినిమాలు రూపొందించడం చాలా కష్టమైన పని. కానీ మీరు సాహసం చేసి, దాన్ని సాధ్యం చేసి చూపించారు. మూవీలో డార్లింగ్ లుక్ అధిరింది. ఇక రిలీజ్ డేట్ ఎప్పుడన్న ప్రశ్న మాత్రమే మిగిలింది’. అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో ఈ సినిమాపై ఎక్పక్టేషన్స్ మరింత విపరీతంగా పెరిగాయి.
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నిజానికి రాజమౌళి సినిమాతో నే ప్రభాస్ కు వరల్డ్ వైడ్ గుర్తింపు లభించింది. బాహుబలి సీక్వె్ల్ తర్వాత నుంచి నిన్నటి ఆదిపురుష్ వరకు కేవలం ప్రభాస్ ఇమేజ్ మీదనే సినిమాలు ఆధారపడ్డాయి. కలెక్షన్లు కూడా అలానే వచ్చాయి. కానీ ‘కల్కి’ మాత్రం దీనికి భిన్నంగా ఉండబోతోంది. బాహుబలి కంటే కూడా భారీ స్థాయిలో ప్రభాస్ ను నిలుపుతుందని ఫ్యాన్స్, నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.