
SSMB28 New Poster : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మహేష్ బాబుకు మాత్రం ఏజ్ పెరిగేకొద్దీ మరింత అందంగా చార్మింగ్ లుక్ తో భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతున్నాడు.. ఈయనకు ముఖ్యంగా లేడీ ఫాలోయింగ్ ఎక్కువ అనే చెప్పాలి. ఇక గత ఏడాది సర్కారు వాటి పాట వంటి ఘన విజయం తర్వాత మహేష్ తన 28వ సినిమాను చేస్తున్నాడు..
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో SSMB28 సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే రెగ్యురల్ షూట్ కూడా స్టార్ట్ అయ్యింది.. ఈ ఏడాది జనవరి నుండి షూట్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.. అయితే ఈ మధ్య కొంత గ్యాప్ ఇచ్చారు.. దీంతో మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ లో బిజీగా ఉన్నాడు..
ఇది పక్కన పెడితే ఈ సినిమా నుండి ఈ రోజు మాస్ స్ట్రైక్ రాబోతుంది అని మేకర్స్ గత మూడు నాలుగు రోజులుగా ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తున్నారు. మే 31న అంటే ఈ రోజు 81వ జయంతి సందర్భంగా ఈ సినిమా నుండి మహేష్ నటిస్తున్న టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ రాబోతుంది.. సాయంత్రం 6 గంటల 3 నిముషాలకు కృష్ణ మోసగాళ్లకు మోసగాళ్లు సినిమా రీ రిలీజ్ తో కలిపి ఈ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు..
మరి ఈ ట్రీట్ కంటే ముందే మహేష్ తన లుక్ ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసారు.. కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ”ఈ రోజు చాలా ప్రత్యేకం.. నాన్న ఇది నీ కోసమే” అంటూ మహేష్ ఎమోషనల్ ట్వీట్ చేసారు.. ఈ పోస్టర్ ను తన నాన్న అయిన కృష్ణ గారికి అంకితం చేసారు.. మరి సాయంత్రం ట్రీట్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.