తాజాగా ఒక హీరోయిన్ చెప్పిన విషయాలు అందరికి ఆశ్చర్యం కలిగించడమే కాకుండా.. ట్రోల్స్ కు కూడా గురి చేస్తున్నాయి.. మరి ఆ భామ ఎవరు దీనిపై కామెంట్స్ చేసారంటే.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నీనా గుప్తా చేసిన కామెంట్స్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ 2 తెరకెక్కిన విషయం తెలిసిందే..
ఈ వెబ్ సిరీస్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. సీజన్ 1 గ్రాండ్ గా హిట్ అవ్వడంతో సీజన్ 2 స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యింది. తమన్నా, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.. మరి ఈ సిరీస్ లో నీనా గుప్తా కూడా నటించారు.. సినిమాల్లో తన వయసుకి తగ్గ పాత్రలు రావడం లేదని దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు ఈ సిరీస్ లో నటించింది..
ఇందులో భాగంగా ఈమె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శృంగారం గుర్తించి యువత తెలుసుకోవడం ఎంతో అవసరం అని కాలేజ్ వెళ్లే రోజుల్లో ముద్దు పెట్టుకోవడం ద్వారా అమ్మాయిలు గర్భం పొందుతారని అనుకునేదాన్ని అని తన తల్లి చాలా స్ట్రిక్ట్ అంటూ ఈమెకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. లస్ట్ స్టోరీస్ 2 లో శృంగార సన్నివేశాలు ఉన్నాయని ఉంటే తప్పేంటి అని ఈమె చెప్పుకొచ్చింది.. ఈమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదే సమయంలో ఈమెపై ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి..
ReplyForward
|