38.7 C
India
Thursday, June 1, 2023
More

  Hiroshima : హీరోషీమాలో మహాత్ముడి విగ్రహం.. ఆవిష్కరించిన ప్రధాని మోడీ..

  Date:

  Hiroshima
  Hiroshima, statue of Mahatma gandhi

  Hiroshima : నేడు ప్రపంచానికే బాస్ ఇండియా. ఇదంతా నరేంద్ర మోడీ వల్లే సాధ్యం. అందరికీ తెలిసిన సత్యమే ఇది. జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ వెళ్లారు. అక్కడ హిరోషిమాలో శాంతి కాముకుడు, భారత జాతి పిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహమే అహింస అన్న ఆలోచనను నలు దిశలా చాటుతుందంటూ ఈ కార్యక్రమానికి సంబంధించిన పొటోలను తన ట్విటర్ లో షేర్ చేశారు ప్రధాని నరేంద్రమోడీ. ‘అక్కడ ఆవిష్కరించిన ఈ విగ్రహం ప్రపంచానికి గొప్ప సందేహం ఇస్తుంది. గాంధేయ ఆదర్శాలైన శాంతి, సామరస్యం  విశ్వ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తాయి. మిలియన్ల మందికి శాంతి కోసం ప్రేరణను ఇస్తాయి.’ అని ప్రధాని జపాన్ భాషలో ట్వీట్ చేశారు.

  జీ-7 సమ్మిట్ వార్షిక సదస్సు, మూడో వ్యక్తిగత క్వాడ్ నేతల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం (మే 19)న జపాన్ లోని హిరోషిమా ప్రాంతానికి వెళ్లారు. ఇందులో ప్రపంచంలోని ఆయా దేశాల అధినేతలతో కలిసి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించనున్నారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఆ తర్వాత గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి సహా వివిధ రంగాల్లో భారత్-జపాన్ మైత్రిని పెంపొందించే మార్గాలపై ఇరు దేశాధినేతలు మాట్లాడారు.

  ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా జరిపిన అణుదాడిలో దాదాపు 1,40,000 మందిని పొట్టనపెట్టుకున్న ‘హిరోషిమా’ అనే పదం వింటే నేటికీ ప్రపంచం భయపడిపోతుందన్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సు కోసం జపాన్ వెళ్లినప్పుడు మహాత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం లభించింది. హిరోషిమాలో ఈ విగ్రహం ఏర్పాటు ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్తుందని మోడీ అభిప్రాయ పడ్డారు.

  ‘భారత్ పర్యటనకు వచ్చినప్పుడు జపాన్ ప్రధానికి బహుమతిగా ఇచ్చిన బోధి వృక్షాన్ని హిరోషిమాలో నాటడం గొప్ప క్షణం, దీని ద్వారా ప్రజలు ఇక్కడకి వచ్చినప్పుడు శాంతి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తున్నా’  అని భారత ప్రధాని పేర్కొన్నారు. అణుదాడిలో తీవ్రంగా గాయపడింది హీరోషీమా. 6 ఆగస్టు, 1945న ప్రపంచంలోని మొదటి అణుదాడిని ఎదుర్కొవ‌డంతో దాదాపు 140,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మూడు రోజుల తరువాత, ఆగస్టు 9 న, యునైటెడ్ స్టేట్స్ నాగసాకి నగరంపై ‘ఫ్యాట్ మ్యాన్’ అనే మరొక బాంబు పడింది.  దీనిలో 75,000 మందికి పైగా మరణించారు. యుద్ధకాలంలో అణుబాంబులను ఉపయోగించిన సంఘ‌ట‌న‌లు ఈ రెండు మాత్ర‌మే మాన‌వ చ‌రిత్ర‌లో ఉన్నాయి.

  Share post:

  More like this
  Related

  మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

    ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

  ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

    మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

  మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

  మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

  సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

  కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Japan : మరికాసేపట్లో జపాన్ కు చేరుకోనున్న మోదీ

  ప్రపంచ అగ్రనేతలతో సమావేశం Japan : ప్రధాని నరేంద్ర మోదీ జీ...

  భారత్ జనాభా పెరుగుదలపై జర్మనీ ఏమ‌న్న‌దంటే..!?

  ప్ర‌పంచ దేశాల్లో భార‌త్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ గ‌ల్గిన...

  ఆ పుచ్చకాయ ధర రూ. 5 లక్షలా?

  పండ్లలో అత్యంత ఖరీదైనవి ఉంటాయి. పండ్లలో చాలా వెరైటీలుంటాయి. దీంతో వాటి...

  రజనీకాంత్ రికార్డ్ ను బద్దలు కొట్టిన ఆర్ ఆర్ ఆర్

  1995 లో విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం '' ముత్తు...