steal plants : ఇంట్లో ఎవరూ లేనప్పుడు దొంగలు చొరబడి అందినకాడికి సొమ్ము, వగైరా ఎత్తుకెళ్తుంటారు. ఇది తరచూ అక్కడక్కడా జరుగుతుండేదే. కానీ వెరైటీ దొంగతనం ఒకటి ఇక్కడ జరిగింది. అయితే వాళ్లు దొంగలు మాత్రం కాదు. కానీ అధికారులు మాత్రం ఎత్తుకెళ్లారంటూ పోలీసులను సంప్రదించారు. చివరకు ఎత్తుకెళ్లింది ఏంటా అని ఆరా తీస్తే.. మొత్తం విషయం తెలుసుకొని అంతా నవ్వుకున్నారు.
అయితే ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సీసీ టీవీ కెమెరాల్లో చిక్కింది. విషయం ఏంటంటే ఢిల్లీ- ముంబై జాతీయ రహదారిపై ఈ దొంగతనం జరిగిందని ఫిర్యాదు అందింది. ఢిల్లీ- ముంబై జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అయితే దర్జాగా లగ్జరీ కారులో వచ్చిన ఓ జంట జాతీయ రహదారి పక్కన ఓ చోట కారు ఆపింది. అక్కడ పచ్చని మొక్కలు కనిపించడంతో వాటిని మెల్లగా కార్లో వేసుకున్నారు.
అయితే ఈ జంట కారులో మొక్కలు ఎత్తుకెళ్తున్న వీడియో సీసీటీవీ కి చిక్కింది. నేషనల్ హైవే అథారిటీ అధికారులు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజీని తీసుకొని తమ మొక్కలు దొంగతనం చేశారంటూ బాండికుయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే కారు నంబరు ఆధారంగా జంటను పోలీసులు గుర్తించారు. అయితే పచ్చని మొక్కలు రోడ్డు పక్కన కనబడితే తీసుకెళ్లామని, దీనికే దొంగతనం అంటూ కేసు నమోదు చేయాలా అంటే జంట వాపోయింది. మరోవైపు నేషనల్ హైవే అథారిటీ వాళ్లు సేకరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయ్యా.. బాబోయ్ ఇదేం కక్కుర్తి.. చివరకు మొక్కలను కూడా చోరీ చేయకుండా వదల్లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.
https://www.indiatoday.in/india/story/video-couple-stops-car-to-steal-plants-placed-alongside-delhi-mumbai-expressway-2415150-2023-08-02