
Stock marketsదేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం దిగిరావడం భారత మార్కెట్లపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 65 వేల559కి చేరుకుంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 19వేల414 వద్ద స్థిరపడింది.
ఒకానొక సమయంలో సెన్సెక్స్ 66వేల64 వద్ద సరికొత్త గరిష్ఠ రికార్డును టచ్ చేసింది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్లు నష్టాలకు దారితీసింది. అయితే ఐటీ.. టెక్.. రియాల్టీ సూచీలు మాత్రం లాభాలతో ముందుండి నడిపించాయి.






