misfire : హైదరాబాద్ కు చెందిన ఒక విద్యార్థి గన్ మిస్ ఫైర్ అయి మరణించాడు. తను పుట్టిన రోజు నాడే మరణం సంభవించడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్రంగా విలపిస్తున్నారు. అమెరికాలోని జార్జియాలోని అట్లాంటాలో తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రమాదవశాత్తు గన్ పేలడంతో హైదరాబాద్‌లోని ఉప్పల్ కు చెందిన యువకుడు ఆర్యన్ రెడ్డి (23) మరణించాడు. అట్లాంటాలోని కెన్సాస్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతన్నాడు ఆర్యన్ రెడ్డి. స్నేహితులతో కలిసి నవంబర్ 13వ తేదీ పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆర్యన్ రెడ్డి ఇటీవల ఒక గన్ ను కొనుగోలు చేశాడు. పుట్టిన రోజున దాన్ని శుభ్రం చేసేందుకు ప్రయత్నించాడు. ప్రమాదశాత్తు ట్రిగ్గర్ లో వేలు పడడంతో ఫైర్ అయ్యింది. దీంతో అతని ఛాతిలోకి గుండు దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలకు గురయ్యాడు. గన్ ఫైర్ శబ్ధం విన్న అతని స్నేహితులు అతని గదికి పరిగెత్తగా, అతను రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. భువనగిరికి చెందిన ఆర్యన్‌రెడ్డి కుటుంబం ప్రస్తుతం ఉప్పల్‌లోని ధర్మపురి కాలనీలో నివాసం ఉంటోంది.