14.9 C
India
Friday, December 13, 2024
More

    Sankalp Diwas : నవంబర్ 28న సుచిరిండియా ఫౌండేషన్ ‘సంకల్ప్ దివాస్’

    Date:

    – ప్రముఖ నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

    Sankalp Diwas
    Sankalp Diwas, Real Hero Sonusood

    Sankalp Diwas : సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 28వ తేదీన ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం జరగనుంది. మానవతావాది, వ్యాపారవేత్త లయన్ డాక్టర్ వై. కిరణ్, ప్రతి సంవత్సరం నవంబర్ 28న ‘సంకల్ప్ దివాస్’ను నిర్వహిస్తున్నారు. అదే ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు.

    సమాజ సేవే లక్ష్యంగా ‘సుచిరిండియా ఫౌండేషన్’ను స్థాపించింది సుచిరిండియా గ్రూప్. ఈ సంస్థ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ, సమాజానికి తమ వంతు సేవ చేస్తుంది. అలాగే సమాజానికి విశేష సేవ చేస్తున్న ప్రముఖులని గుర్తించి, వారిని సత్కర్తించడంలోనూ సుచిరిండియా ఫౌండేషన్ ముందుంటుంది. సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ‘సంకల్ప్ దివాస్’కి ఎంతో విశిష్టత ఉంది.

    ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖుల సేవలను గుర్తించి వారిని ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరిస్తుంటారు. దాదాపు రెండు దశాబ్దాలుగా, ప్రతి ఏడాది గొప్ప మానవతావాదులను గుర్తించి వారిని సత్కరిస్తున్నారు. వారిలో అన్నా హజారే, కిరణ్ బేడీ, సుందర్‌లాల్ బహుగుణ, సందీప్ పాండే, జోకిన్ అర్పుతం, మేరీ కోమ్ వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు. ఈ సంవత్సరం ‘సంకల్ప్ దివాస్’లో ప్రముఖ నటుడు సోనూసూద్ ను ‘సంకల్ప్ కిరణ్ పురస్కారం’తో సత్కరించనున్నారు. నవంబర్ 28వ తేదీన సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, లలితా కళాతోరణంలో భారత్-బల్గేరియా రాయబార కార్యాలయ అంబాసిడర్ హెచ్.ఈ. నికోలాయ్ యాంకోవ్ ముఖ్య అతిథిగా ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం ఘనంగా జరగనుంది.

    లయన్ డాక్టర్ వై. కిరణ్ గారి ప్రతి ఆలోచన, ప్రతి అడుగు సమాజ సేవ గురించే ఉంటుంది. ఆయన ఆలోచన నుంచి పుట్టినదే ‘సంకల్ప్ దివాస్’. ‘సుచిరిండియా ఫౌండేషన్’ తలపెట్టిన ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.. ఆపదలో ఉన్న వారిని ఆదుకొని, వారికి మెరుగైన జీవితాన్ని అందించడం. ప్రస్తుత ఆకలిని తీర్చే నిత్యావసర వస్తువులను అందించడం మొదలుకొని, భవిష్యత్ కి బాటలు వేసే వస్తులను అందించడం వరకు ‘సంకల్ప్ దివాస్’ చేస్తోంది. అనాథ పిల్లలను, బాల కార్మికులను, పేద విద్యార్థులను గుర్తించి వారి చదువుకి కావాల్సిన సహాయసహకారాలను అందిస్తుంది.

    దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అందించి, వారు వైకల్యాన్ని అధిగమించి జీవితంలో ముందుకు అడుగులు వేసేలా అండగా నిలబడుతుంది. ఒంటరి పేద మహిళలకు కుట్టు మిషన్లు లేదా ఇతర ఉపయోగకర యంత్రాలను అందిస్తుంది. అలాగే వారు రూపొందించిన వస్తువులు, నేసిన వస్త్రాలను వారే స్వయంగా విక్రయించుకునే విధంగా ఎగ్జిబిషన్ లను వంటివి ఏర్పాటు చేసి, వారిని చిరు వ్యాపారులుగా తీర్చిదిద్దుతుంది. ఇలా కేవలం సహాయం చేసి చేతులు దులుపుకోకుండా, వారికి అడుగడుగునా అండగా నిలుస్తూ, మెరుగైన జీవితాన్ని అందిస్తుంది సంకల్ప్ దివాస్. అలాగే ప్రముఖుల సేవలను గుర్తించి వారిని సత్కరించడం ద్వారా, సమాజానికి సేవ చేయాలనే ఆలోచనను మరెందరికో కలిగేలా చేస్తోంది.

    Share post:

    More like this
    Related

    Rains : ముంచుకొస్తున్న ముప్పు.. అల్పపీడనంతో ఆ జిల్లాల్లో వర్షాలు

    Rains Alerts : ఏపీకి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం...

    Nagababu : ఈ వారంలోనే నాగబాబు ప్రమాణ స్వీకారం?

    Nagababu : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని...

    Empty plate : నాయుడి ముందు ఖాళీ ప్లేట్

    Empty plate : నాయుడి ముందు ఖాళీ ప్లేట్ఏ. దో సూప్ ఇచ్చారు....

    Midterm Elections : జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు

    Midterm elections : జమిలి ఎన్నికలతో దేశంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sonusood : సీఎం చంద్రబాబు పాలన భేష్: సోనూసూద్

    Real Hero Sonusood : సుదీర్ఘ పాలన అనుభవం ఉన్న ఏపీ...

    Sonusood : తెలుగు రాష్ట్రాల్లో వరదలు.. సోనూసూద్ సాయం

    Sonusood help : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదల కారణంగా భారీ...

    New Jersey : ఇండియా ఇండిపెండెన్స్ డే సందర్భంగా న్యూ జెర్సీలో భారీ ర్యాలీ.. హాజరైన సోనూసూద్, సోనాల్..

    భారీ ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగిందంటే? New Jersey :...

    Sonu Sood : సోనూ సూద్ కు బర్త్ డే విషెస్ చెప్పిన యూబ్లడ్ ఫౌండర్ డాక్టర్ జై

    Sonu Sood Birthday Celebrations : ప్రముఖ నటుడు, ప్రజా సేవకుడు...