
Sudheer new movie : సుడిగాలి సుధీర్.. ఈయనకు బుల్లితెర మీద పవర్ స్టార్ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.. సుధీర్ కు నటన, కామెడీ పరంగా పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది.. అందుకే ఈయనను ఎక్కువగా ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు.. జబర్దస్త్ వల్ల స్టార్ట్ అయిన సుధీర్ స్టార్ డమ్ వెండితెర వరకు వచ్చింది..
ఇప్పటికే వెండితెర మీద హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తాజాగా మరో కొత్త సినిమాను లాంచ్ చేసాడు.. కొత్త సినిమా ప్రాజెక్ట్ ను తాజాగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసారు. సుధీర్ 4వ సినిమా కావడంతో ఈ సినిమాతో మరింత ఎత్తుకు ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.. ఇక ఈ సినిమాతో నరేష్ కొత్త డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు..
మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో కోలీవుడ్ ముద్దుగుమ్మ దివ్య భారతీని హీరోయిన్ గా ఫిక్స్ చేయడం జరిగింది.. ఈమె అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. కోలీవుడ్ లో బ్యాచిలర్ సినిమాతో మంచి పాపులర్ అయిన ఈ బ్యూటీ సుధీర్ సరసన నటిస్తుంది అని తెలియగానే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి..
ఈ హాట్ బ్యూటీ సుధీర్ తో రొమాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.. ఈమె అడుగు పెట్టడమే సుధీర్ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది.. మరి ఈ హాట్ బ్యూటీ ఏ రేంజ్ లో అలరిస్తుందో వేచి చూడాలి.. ఇక సుధీర్ ఈ కొత్త ప్రాజెక్ట్ తో ఎలాంటి హిట్ అందుకుంటాడా అనేది కొద్దీ రోజులు ఎదురు చూస్తే తెలుస్తుంది.